
కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత నివారణ చర్యలు చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్స్ లో అన్ని వసతుల కల్పించాలని మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు.