
దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేధిక ప్రకారం ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర, కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో బుధవారం 18-44 ఏళ్ల లోపు 2,30,305 మంది లబ్ధిదారులకు మొదటి డోసు వేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు వారికి 9,02,731 మోతాదులు వేసినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,24,30,828 మంది లబ్ధిదారుకు టీకాలు వేయగా ఇందులో ఆరోగ్య కార్యకర్తల్లో 94,52,975 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.