Viral Picture : ‘కొత్త ఒక వింత.. పాత ఒక రోత’ అంటారు.. ఇప్పుడు ట్రాఫిక్ చాలన్లు తప్పించుకోవడానికి ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. బెంగుళూరు వ్యక్తి పేపర్ బ్యాగ్‌ని హెల్మెట్‌గా ధరించాడు. ఇది ఎవరో ఫొటో తీసి షేర్ చేయడంతో ఇంటర్నెట్ వైరల్ అయ్యింది. ఇంటర్నెట్‌లో చాలా మంది దీనిని ‘పీక్ బెంగళూరు’ ప్రవర్తన అని పిలుస్తున్నారు.
ఐటీ సిటీ బెంగళూరు నగరంలో ఏదీ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.. ఇక్కడి విషయాలను హైలైట్ చేసే అనేక ఇంటర్నెట్ మీమ్‌లు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ హబ్‌లో తాజాగా పేపర్ హెల్మెట్ ఇంటర్నెట్ లో నిండిపోయింది. బెంగళూరులో ఒక వ్యక్తి బైక్‌పై వెనుకాల కూర్చున్నప్పుడు హెల్మెట్‌కు బదులుగా తలకు పేపర్ బ్యాగ్ ధరించి కనిపించాడు. ఈ సంఘటనను ఓ ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. నల్లటి టీ-షర్టు ధరించిన వ్యక్తి బైక్‌పై కూర్చుని రోడ్డు దాటడానికి ఎదురు చూస్తున్నప్పుడు పేపర్ బ్యాగ్‌తో తలను భద్రంగా కప్పుకుని కనిపించాడు. బెంగళూరులో వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ వ్యక్తి హెల్మెట్ కు బదులుగా పేపర్ బ్యాగ్ కప్పుకోవడం నవ్వులు పూయించింది.
ఈ వైరల్ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఇది ”విలక్షణమైన బెంగళూరు ప్రవర్తన” అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.. కొంతమంది వినియోగదారులు పేపర్ బ్యాగ్ ”భేజా ఫ్రై పార్సెల్” అని.. ”టిన్ ఫాయిల్ టోపీ కంటే సురక్షితమైనది” అని చమత్కరించారు. మరికొందరు ”కేవలం బైక్ రైడ్‌ని ఆస్వాదించాలనుకునే సెలబ్రిటీ అయి ఉండవచ్చు.” అని కామెంట్ చేశారు. ”ఇన్నోవేషన్!! దుమ్ము/చలి/కలుషితమైన గాలి నుండి రక్షణ.” అని ఇంకొకరు కామెంట్ చేశారు.. ఇంకొందరు అయితే ఈ ఐడియా ”అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్” అని అన్నారు. ”స్వీట్స్ హెల్మెట్ కవర్‌ను 100% రీసైక్లింగ్‌తో రీసైకిల్ చేస్తాయి..’ బెస్ట్ హెల్మెట్ అంటూ కొందరన్నారు.
ఇటీవల మరో పీక్ బెంగళూరు మూమెంట్ వైరల్ అయింది. గత నెలలో, బెంగళూరు సిలికాన్ వ్యాలీలోని రద్దీ వీధుల్లో బైక్‌పై ఒక మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక మహిళ ఒక వ్యక్తి వెనుక కూర్చున్నట్లు చూపించింది, ఇలాంటి వీడియోలు కేవలం “బెంగుళూరులో మాత్రమే” అని అందరూ దెప్పి సెటైర్లు వేస్తున్నారు.
Helmet, what's that? pic.twitter.com/8WwA8ICVfz
— ThirdEye (@3rdEyeDude) November 12, 2023