
Vijay Deverakonda- Rishab Shetty: గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం ని సృష్టించిన ‘కాంతారా’ చిత్రాన్ని మన ఇండియన్ మూవీ లవర్స్ అంత తేలికగా మర్చిపోగలరా..?, కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.ఈ చిత్రం లో హీరోగా నటించిన రిషబ్ శెట్టినే దర్శకత్వం కూడా వహించాడు.
ఒక పక్క అద్భుతమైన టేకింగ్ ని చూపిస్తూనే మరోపక్క అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాడు.త్వరలోనే ‘కాంతారా-2’ ని సెట్స్ మీదకి తీసుకొని రాబోతున్న రిషబ్ శెట్టి, అతి త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నాడట.ఇటీవలే హైదరాబాద్ కి వచ్చిన రిషబ్ శెట్టి విజయ్ దేవరకొండ ని ఇంటికెళ్లి కలిసి కాసేపు చర్చలు జరిపారట.ఈ చర్చ మొత్తం వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా గురించే అని తెలుస్తుంది.
అయితే ఈ చిత్రం రురల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని..కాంతారా తరహాలోనే తెరకెక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, అయితే విజయ్ దేవరకొండ కి ఇలాంటి పాత్రలు సెట్ అవుతాయా అని అభిమానులు సందేహ పడుతున్నారు.ఎందుకంటే ముట్టుకుంటే మాసిపోయ్యేంత అందం గా ఉండే విజయ్ దేవరకొండ కి , రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా చెయ్యడం అంటే ప్రయోగం చేసినట్టే.

సరిగా కేర్ తీసుకోవాలి లేకుంటే మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు చెప్తున్నా మాట.మరి రిషబ్ శెట్టి ఎలా డీల్ చేస్తాడో చూడాలి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ అనే డైరెక్టర్ తో ‘ఖుషి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి తో మరో సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాతే రిషబ్ శెట్టి తో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.