https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ సినిమాతో విజయ్ దేవరకొండ బిజినెస్ స్టార్ట్

  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణి ఈ కాలం హీరోల్లో కనిపిస్తోంది. నాలుగు హిట్లు చేతిలో పడగానే ఆ డబ్బులతో సెటిల్ కావాలని.. మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. తద్వారా సినిమాలు ఆడకపోయినా ఆ డబ్బులతో జీవితాంతం బతికేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు దారిలోనే యువ హీరో విజయ్ దేవరకొండ పయనిస్తున్నారు. రెండు చేతులా సంపాదస్తూ ఇతర వ్యాపాకాల ద్వారా కూడా (యాడ్స్ రూపంలో) డబ్బు వస్తుండడంతో ఇక వేరే వ్యాపారాల […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2021 / 09:57 AM IST
    Follow us on

     

    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణి ఈ కాలం హీరోల్లో కనిపిస్తోంది. నాలుగు హిట్లు చేతిలో పడగానే ఆ డబ్బులతో సెటిల్ కావాలని.. మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. తద్వారా సినిమాలు ఆడకపోయినా ఆ డబ్బులతో జీవితాంతం బతికేలా ప్లాన్ చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే మహేష్ బాబు దారిలోనే యువ హీరో విజయ్ దేవరకొండ పయనిస్తున్నారు. రెండు చేతులా సంపాదస్తూ ఇతర వ్యాపాకాల ద్వారా కూడా (యాడ్స్ రూపంలో) డబ్బు వస్తుండడంతో ఇక వేరే వ్యాపారాల వైపు మళ్లుతున్నారు.

    విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రమే కాదు బిజినెస్ కూడా చేస్తున్నాడు.‘రౌడీ వేర్’ అంటూ క్లాత్ షోరూం మొదలుపెట్టి ఆన్ లైన్ లో అమ్మేస్తున్నాడు. దాంతోపాటు మరిన్ని బిజినెస్ ల వైపు విజయ్ దేవరకొండ దృష్టి సారించాడు.

    తాజాగా విజయ్ చూపు మల్టీప్లెక్స్ రంగంపై పడింది. అందులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈయన ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా నిలిచింది.

    ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టాడు.ఈయన కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు.

    తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని తిరుమల థియేటర్ ను పూర్తిగా మార్చేసి దాన్ని ఏవీడీ సినిమాస్ గా పునర్నిర్మించారు. ‘ఏషియన్ విజయ్ దేవరకొండ’ సినిమాస్ గా ఈ కొత్త బిజినెస్ లోకి దిగాడు.

    విజయ్ దేవరకొండ హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉండగా మహబూబ్ నగర్ లోనే ఎందుకు థియేటర్ బిజినెస్ స్టాట్ చేశాడంటే ఆయన సొంతూరు పాలమూరు జిల్లానే. అచ్చంపేటలోనే విజయ్ దేవరకొండ పుట్టి పెరిగాడు. విజయ్ తండ్రి గోవర్ధన్ దేవరకొండ అచ్చంపేటలోనే ఉండేవాడు. ఆ తర్వాత కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చాడు.

    దాంతో సొంత జిల్లాలోనే ఇప్పుడు మల్టీపెక్స్ బిజినెస్ ను విజయ్ మొదలుపెట్టడం విశేషం. ఇక ఈ సినిమా థియేటర్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ థియేటర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో మొదలుపెట్టాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడట.. ఈ ఓపెనింగ్ కు విజయ్ రానున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజ్ కానుంది. అప్పుడే తన మల్టీప్లెక్స్ బిజినెస్ ను పవన్ సినిమాతో మొదలు పెట్టనున్నాడట ఈ రౌడీ హీరో.. మరి పవన్ సినిమాతో పవన్ ఫ్యాన్స్ అండతో ఓపెన్ అవుతున్న ఈ బిజినెస్ విజయ్ ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.