https://oktelugu.com/

అసెంబ్లీ వైపు చూపు.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ పద్దులపై ప్రసంగించనున్నారు. బడ్జెట్ లో వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులపై కేసీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై ఉద్యోగుల చూపంతా అసెంబ్లీ వైపే నెలకొంది. ఉద్యోగులు అంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎలా ప్రకటన చేయబోతున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ కు.. ఇప్పుడా రెండు ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ విజయం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2021 / 08:42 AM IST
    Follow us on

    తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ పద్దులపై ప్రసంగించనున్నారు. బడ్జెట్ లో వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులపై కేసీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై ఉద్యోగుల చూపంతా అసెంబ్లీ వైపే నెలకొంది.

    ఉద్యోగులు అంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎలా ప్రకటన చేయబోతున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ కు.. ఇప్పుడా రెండు ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించేందుకు సిద్ధమైంది.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పీఆర్సీ ప్రకటనకు ఈసీ నుంచి ప్రభుత్వం అనుమతి తీసుకుంది. ఈనెల 20న ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇందుకు ఈసీ వెంటనే స్పందించింది. పీఆర్సీ ప్రకటించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ సీఈసీ కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి లేఖ రాశారు.

    అయితే ఉప ఎన్నికపై ప్రావం పడకుండా దీన్ని అమలు చేయాలని.. ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది.

    దీంతో ఈరోజు సీఎం కేసీఆర్ స్వయంగా పీఆర్సీపై ప్రకటించడానికి రెడీ అయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇప్పటికే కేసీఆర్ పీఆర్సీపై స్వయంగా ప్రకటన చేస్తానని అసెంబ్లీలో అన్నారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ప్రకటిస్తారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది. సుమారు 29శాతం ఉండొచ్చని అంటున్నారు.

    ఇక ఫిట్ మెంట్ తోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్ పెన్షన్ , హెల్త్ కార్డు వంటి అంశాలపై కూడా కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారని అంటున్నారు. ఆదివారం రాత్రి ఈ మేరకు కేసీఆర్ సుధీర్ఘంగా ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు.

    మొత్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ఎట్టకేలకు పరిష్కారం చూపిస్తున్నారని తెలుస్తోంది.