Viral Video: మనదేశంలో పెళ్లిళ్ల సీజన్ లో వేలకోట్ల వ్యాపారం జరుగుతోంది. అందువల్లే పెళ్లిళ్ల సీజన్లో కార్పొరేట్ కంపెనీలు రకరకాల రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇక ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబాలు పెళ్లి వేడుకలను అత్యంత ఆడబరంగా నిర్వహిస్తున్నాయి. బంగారం నుంచి మొదలుపెడితే విందు వరకు ప్రతి విషయంలోనూ తమదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాయి. గత ఏడాది ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ – రాధిక మార్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వివాహం కోసం ముకేశ్ అంబానీ దాదాపు వందల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ ఉండేలాగా చూస్తున్నారు. ఇక తెలుగు నాట తమ వివాహాలను ఘనంగా జరుపుకునే.. మహా గొప్పగా నిర్వహించుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.. వివాహ వేదిక నుంచి మొదలు పెడితే విందు వరకు తమ ప్రత్యేకతను చాటుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ వివాహాల కోసం వందల కోట్లను ఖర్చుపెట్టారు.. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ వివాహానికి హాజరైన అతిథులకు వెండి పల్లాలు, ఇతర వెండి ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు.
Also Read: నిజమైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలి.. తప్పుడు కథనాలు రాసే నాన్ జర్నలిస్టులు క్రిమినల్సే..!
కొత్త కొత్తగా..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుకలో విందు వడ్డించడానికి అందమైన యువతులను నియమించారు. వారికి నలుపు రంగు చీరలు కట్టి.. మెడలో విలువైన బంగారు ఆభరణాలు వేసి.. అందంగా ముస్తాబు చేశారు. ఆ యువతులు ఒక్కొక్క వంటకాన్ని వడ్డించడం మొదలుపెట్టారు. దీంతో వచ్చిన బంధువులు ఆశ్చర్యంతో చూశారు. ఆ తర్వాత వారు పెట్టే వంటకాలను కడుపు నిండా తిన్నారు. ఫలితంగా ఒక్క ఆహారపదార్ధం కూడా వృధా కాలేదు. పైగా ఇలాంటి ఆతిథ్యం ఎప్పుడూ చూడలేదని వచ్చిన అతిథులు పేర్కొన్నారు..”అందమైన యువతులు గొప్పగా ఉన్నారు. అందంగా ముస్తాబై వంటకాలు వడ్డించారు. వారు వడ్డించిన విధానం చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. ఇలాంటి యువతులను క్యాటరింగ్ కు పెట్టుకుంటే వండిన వంటకాలు మొత్తం అయిపోతాయి. అంతేకాదు కొత్తగా వంటలు వండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి యువతులు కేటరింగ్ చేస్తుంటే పెళ్లి చేసుకున్నవారు. ఏదో మిస్ అయిపోయామనే బాధలో ఉంటారు. పెళ్లి చేసుకునేవారు వీరితోనే క్యాటరింగ్ నిర్వహించాలని భావిస్తారు. కానీ ఇలాంటి విధానం గొప్పగా ఉంది. ఈ ఆలోచన రావడమే అద్భుతంగా ఉంది. ఇలాంటి క్యాటరింగ్ చూడడం ఇదే తొలిసారని” నెటిజన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.ఐతే ఓ కార్పొరేట్ కంపెనీ ఇలా యువతులతో క్యాటరింగ్ చేయిస్తోందని.. ఆ యువతులు అందంగా వడ్డించడంతో.. పెళ్లికి వచ్చిన అతిధులు సంబరపడిపోతున్నారని.. తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ తమ బిజినెస్ పెంచుకోవడానికి ఆ కంపెనీ ఇలా యువతులతో వంటలను సర్వ్ చేయించడం.. బాగుందని పెళ్లికి వచ్చిన అతిధులు వ్యాఖ్యానించడం విశేషం.
View this post on Instagram