HomeతెలంగాణCM Revanth Reddy: నిజమైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలి.. తప్పుడు కథనాలు రాసే నాన్‌ జర్నలిస్టులు...

CM Revanth Reddy: నిజమైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలి.. తప్పుడు కథనాలు రాసే నాన్‌ జర్నలిస్టులు క్రిమినల్సే..!

CM Revanth Reddy: తెలంగాణలో జర్నలిస్టులు, జర్నలిజం గురించి ఇప్పటికే పలుమార్లు చర్చ జరిగింది. సోషల్‌ మీడియా(Social Media), యూట్యూబ్‌ ఛానెళ్లు వచ్చాక ఇష్టానుసారం వార్తలు, కథనాలు వైరల్‌ చేస్తున్నాయి. దీంతో జర్నలిజం విలువలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: అసెంబ్లీకి కేవలం రెండుసార్లు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Cm Revanth reddy) ‘నిజమైన జర్నలిస్టులు ఎవరో చర్చ జరగాలి‘ అనే అంశంపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మీడియా వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. 2024, సెప్టెంబరు 8న హైదరాబాద్‌(Hyderabad)లోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ జర్నలిజం రంగంలో నాణ్యత, విశ్వసనీయత, మరియు ప్రొఫెషనలిజం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.‘నిజమైన జర్నలిస్టులు ఎవరు, నకిలీ వారు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కార్డు వేసుకుని రిపోర్టర్‌గా హల్‌చల్‌ చేస్తున్నారు. జర్నలిజం(Jarnalism) అంటే ఏమిటో, నిజమైన జర్నలిస్ట్‌ ఎవరో సమాజానికి స్పష్టత రావాలి‘ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు యూట్యూబ్‌ ఛానల్స్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం చేసే వారిని తప్పు పట్టారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల (Assembly Budjet Meetings)సందర్భంగా అసెంబ్లీ వేదికగానే మరోమారు జర్నలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులపైనీ నీచంగా కథనాలు రాస్తున్నారన్నారు. కొందరికి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. ‘ప్రజల కోసం పని చేసే, వారి సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గంగా ఉంటే, కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించడానికి పని చేసే వారు మరో వర్గంగా ఉన్నారు. ఈ రెండు వర్గాలను వేరు చేయాలని సూచించారు. లేకపోతే నిజమైన జర్నలిస్టులకు నష్టం జరుగుతుంది‘ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన జర్నలిజం రంగంలో విలువలు, విజ్ఞత కలిగిన భాషా ప్రయోగం ఉండాలని సూచించారు.

ప్రెస్‌ అకాడమీకి సూచన..
జర్నలిజంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. నిజమైన జర్నలిస్టులు(Journalists) ఎవరూ. తప్పుడు జర్నలిస్టులు ఎవరో తేల్చాలని ఐఅండ్‌పీఆర్‌కు సూచించారు.తెలంగాణ మీడియా అకాడమీకి ఆయన ఒక సూచన చేశారు. చిన్న, మధ్య, పెద్ద తరహా పత్రికలను గుర్తించి, కేంద్రం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, రాజకీయ పార్టీల సొంత జర్నలిజం వంటి అంశాలను క్రోడీకరించి కొత్త విధానాలను రూపొందించాలన్నారు. ఈ చర్చ ద్వారా నిజమైన జర్నలిస్టులను గుర్తించడంతోపాటు, వారికి సరైన గౌరవం, రక్షణ కల్పించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిస్టు సమాజంలో మిశ్రమ స్పందనలను రేకెత్తించాయి. కొందరు దీనిని నిజమైన జర్నలిజాన్ని పరిరక్షించే ప్రయత్నంగా సమర్థిస్తే, మరికొందరు దీనిని మీడియా స్వేచ్ఛపై ఒత్తిడిగా భావించారు. ఈ చర్చ రాష్ట్రంలో జర్నలిజం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular