Monkeys Attacking Leopard: పులి.. ఈ పేరు చెబితే చాలు మనుషులే కాదు అడవిలో ఉండే జంతువులు కూడా వణికి పోతాయి. సింహం, ఏనుగు లాంటి జంతువుల మినహాయిస్తే మిగతా వారిని పులి బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటాయి. అయినప్పటికీ పులి ఊరుకోదు కదా.. పొదల చాటున నక్కినక్కి ఉండి ఒక్కసారిగా దాడి చేస్తుంది. పీక కొరికి తన పదునైన దంతాలతో ప్రత్యర్థి జంతువును చంపేస్తుంది. దాని మాంసాన్ని చీల్చి చీల్చి తింటుంది. అయితే అలాంటి పులికి ఎదురు వెళ్లడం అంటే మైస్సమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టే. కానీ దక్షిణాఫ్రికాలోని ఓ అడవిలో పులికి కొన్ని కోతులు ఎదురు వెళ్లాయి.. తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి.
అడవులకు ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికాలో.. సఫారీ టూరిజానికి కొదవ ఉండదు. ఆ అద్భుతమైన ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి కొంతమంది పర్యాటకులు దక్షిణాఫ్రికాలోని ఓ అడవిని సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద వాతావరణం నిర్మానుష్యంగా ఉంది. ఈలోగా ఒక కోతిని చంపి తినడానికి పులి వచ్చింది. దానిపై దాడి చేసింది. ఈ లోగానే కొన్ని కోతుల మంద ఒక్కసారిగా పులి మీద పడింది. ఆ కోతులన్నీ కలిసి పులి మీద దాడికి ప్రయత్నించాయి. దీంతో ఒక్కసారిగా ఆ పులి భయపడి అడవిలోకి పారిపోయింది. రోడ్డు మీద ఉన్న వాహనంలో కూర్చున్న పర్యాటకులు ఆ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించారు.
nature is amazing అనే ట్విట్టర్ ఎక్స్ ఐ డి లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు “కోతులు చేసిన కిష్కింధ కాండ ధాటికి పులి బెంబేలెత్తి పోయింది. కోతల దెబ్బ.. పులి అబ్బా” అని కామెంట్లు చేస్తున్నారు. “దక్షిణాఫ్రికాలోని అడవి ప్రాంతంలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. కాకపోతే ఆ జంతువులు పోట్లాడుకుంటుంటే వెనుక నుంచి వీడియో తీయడం అనేది ఒక గొప్ప అనుభూతి” అని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
baboons group up and attack a cheeta pic.twitter.com/K7o0XrRYtO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) February 23, 2024