Tomatoes: ఏం టాలెంట్ అన్నా నీది.. వందల టమాటాలను.. రెండు చేతులతో..వైరల్ వీడియో

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి వంట చేసేందుకు కూరగాయలను మొత్తం దగ్గర పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా టమాటాలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాడు.

Written By: Velishala Suresh, Updated On : February 25, 2024 12:07 pm
Follow us on

Tomatoes: అన్ని పనుల కంటే వంట చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. చూసేవారికి చేసేవారి శ్రమ తక్కువగానే కనిపిస్తుంది. కానీ వంట చేస్తే తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో. ఇలా వంట తయారీలో ఒక్కొక్కరూ ఒక్కో శైలి ప్రదర్శిస్తుంటారు. వంట తయారు చేసే విధానంలో తమదైన ముద్ర వేసి చూసేవారిని ఆశ్చర్యపరుస్తుంటారు. కొంతమంది వంట తయారు చేసే విధానంలో సరికొత్త పద్ధతులు అవలంబించి షాక్ కు గురి చేస్తుంటారు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇలాంటి వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆ వీడియో మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి అత్యంత వేగంగా టమాటాలను కట్ చేస్తుండడం చూసి నెటిజన్లు
“ఏం టాలెంట్ అన్నా నీది.. వందల టమాటాలను.. రెండు చేతులతో.. ఎలా కట్ చేస్తున్నావంటూ” కితాబిస్తున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి వంట చేసేందుకు కూరగాయలను మొత్తం దగ్గర పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా టమాటాలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాడు. వందల కొద్దీ టమాటాలను (tomatoes) అప్పటికప్పుడు కట్ చేయాలంటే చాలా సమయం పడుతుందని అనుకున్నాడు. వెంటనే అతడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. ఓ పదునైన, పొడవాటి కత్తిని తీసుకొని టమాటాలను అత్యంత ఓర్పుగా, వేగంగా అటూ ఇటూ తిప్పుతూ కట్ చేశాడు.

అలా అతడు వేగంగా కట్ చేస్తుండగానే టమాటాలు మొత్తం చిన్న చిన్న ముక్కలయిపోయాయి. పెద్ద గిన్నెను క్షణాల వ్యవధిలో తిప్పుతూ చాకచక్యంగా టమాటాలు కట్ చేసిన విధానం పట్ల నెటిజన్లు ఔరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టమాటాలు ఇలా కూడా కట్ చేస్తారా అంటూ షాక్ కు గురవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..”నువ్వు టమాటాలు కట్ చేసే విధానం చాలా బాగుంది. నీ టాలెంట్ మామూలుగా లేదు”, “టమాటాలు ఇలా కూడా కట్ చేస్తారని నిన్ను చూసి నాకే తెలుసుకున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..