Viral Video: కాలే కడుపుకు తెలుసు.. ఆ ఆకలి విలువ.. ఆకలి ఎంత మనిషిని అయినా అతలాకుతలం చేస్తుంది. ఆ ఆకలి తీర్చుకోవడానికే అందరూ పనిచేసేది.. పూట నింపుకోవడానికి మన ఈ కుప్పగంతులు.. సవాలక్ష జాబులతో నానా రకాలుగా తిప్పలు పడేది. ఉద్యోగాలు, కూలీలు, రోజూ వారీ పనులు అన్నీ కూడా మూడు పూటలా కడుపు నింపుకోవడానికే.. అయితే అందరికీ ఆ మాత్రం తిండి దొరుకుతోంది. కొందరు విలాసంగా బతుకుతారు. కొందరు రోజువారీ కూలీతో వచ్చిన డబ్బులతో పొట్ట పోసుకుంటారు. కానీ అనాథ పిల్లల పరిస్థితి ఏంటి? వారికి తినడానికి తిండి లేక అడుక్కుంటూ ఒక్క పూట భోజనం కోసం కూడా అలమటిస్తున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా ఒక బాలుడు భోజనం చేస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్దిరోజులుగా చూడని అన్నాన్ని చూడగానే.. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అతడి కంటి నుంచి జలజలా కన్నీళ్లు జాలు వారాయి. పాపం.. ఎప్పుడు తిన్నాడో ఏమో.. అన్నాన్ని చూడగానే తట్టుకోలేకపోయాడు. ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఆ ఆకలి బాధ పోయి కన్నీళ్ల రూపంలో తన్నుకొచ్చింది.
Also Read: విభజన హామీలు కొలిక్కి వచ్చేనా?
ఎవరో మహాత్ములు ఆ బాలుడి ఆకలి తీర్చారు. బాలుడు తింటుంటే వీడియో తీశారు. ఒక్క ముద్ద కోసం ఎంతో అలమటిస్తున్న ఆ బాలుడి కంటతడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకలి విలువ తెలుసు కాబట్టే.. ఆ అన్నం అతడికి అపురూపంగా మారింది. అన్నం విలువ తెలిసిన వాడే ఎప్పుడూ వృథా చేయడు. ఇలాంటి పేదల కడుపులు నింపొచ్చు.
Also Read: కన్ఫ్యూజ్ చేస్తున్న గంటా.. చంద్రబాబు రమ్మన్నా రావట్లే.. వేరే ప్లాన్ ఉందా..?
పొద్దున టిఫిన్, లంచ్, డిన్నర్ అంటూ మనం హోటల్స్, రెస్టారెంట్స్ లలో ఖరీదైన భోజనాలు చేస్తుంటారు. ఫంక్షన్లలో ఎంతో అన్నాన్ని వృథా చేస్తుంటాం.. అలాంటి వారికి ఈ బాలుడి ఆకలిబాధ నిజంగా ఒక గుణపాఠం అని చెప్పాలి. ఒక్కపూటకు లేని ఇలాంటి బాలురు ఎంతో మంది మన సమాజంలోనే ఉన్నారు. మన దగ్గర మిగిలిన అన్నాన్ని లేదా.. అన్నదానాన్ని అయినా ఇలాంటి వారికి అందజేస్తే వారి కడుపులు నింపిన వారం అవుతాం.. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటుంటారు. దాన్ని ఈ వీడియో చూశాకైనా అందరూ మారి ఆకలిదప్పులతో అలమటించే వారికి అందజేస్తే అంతకంటే మహాభాగ్యం మరొకటి ఉండదు.. మీరందరూ పాటిస్తారని ఆశిస్తూ..