Bheemla Nayak Release Poster: ఇన్నాళ్ల‌కు రాణా గుర్తొచ్చాడా.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ పోస్ట‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసిన మేక‌ర్స్‌..!

Bheemla Nayak Release Poster: ఒక హీరో ఇంకో సినిమాలో చేస్తున్నాడంటేనే అంచ‌నాలు వేరే లెవ‌ల్ లో ఉంటాయి. ఆ సినిమాలో హీరోల పాత్ర ఎలా ఉంటుంది, ఎవ‌రిని హైలెట్ చేస్తారు? ఎవ‌రిని త‌గ్గిస్తారు అనే లెక్క‌ల‌తో వారి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. ఇలాంటి ఇంట్రెస్ట్ భీమ్లా నాయ‌క్ మీద ఎప్ప‌టి నుంచో ఉంది. ఎందుకంటే ఇందులో రాణా విల‌న్ గా చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాలో మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణే క‌నిపిస్తాడా లేదంటే […]

Written By: Mallesh, Updated On : February 18, 2022 4:26 pm
Follow us on

Bheemla Nayak Release Poster: ఒక హీరో ఇంకో సినిమాలో చేస్తున్నాడంటేనే అంచ‌నాలు వేరే లెవ‌ల్ లో ఉంటాయి. ఆ సినిమాలో హీరోల పాత్ర ఎలా ఉంటుంది, ఎవ‌రిని హైలెట్ చేస్తారు? ఎవ‌రిని త‌గ్గిస్తారు అనే లెక్క‌ల‌తో వారి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. ఇలాంటి ఇంట్రెస్ట్ భీమ్లా నాయ‌క్ మీద ఎప్ప‌టి నుంచో ఉంది. ఎందుకంటే ఇందులో రాణా విల‌న్ గా చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాలో మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణే క‌నిపిస్తాడా లేదంటే రాణాకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా అని వారి అభిమానులు ఎద‌రు చూస్తున్నారు.

Bheemla Nayak Release Poster

అయితే సినిమా పేరు ద‌గ్గ‌రి నుంచి పాట‌ల దాకా.. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ వ‌ర‌కు అంతా ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌ట్టు చూపించేశారు. ఇక ఈ నెల 25న సినిమా రిలీజ్ కాబోతుండ‌గా.. మ‌ళ్లీ ప‌వ‌న్ జ‌ప‌మే చేస్తూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. కానీ ఇప్పుడిప్పుడే రాణాకు కూడా ప్రాముఖ్య‌త క‌ల్పిస్తున్నారు. రిలీజ్ పోస్ట‌ర్ల మీద రాణాను కూడా చూపించి సినిమా మీద అంచ‌నాలు పెంచేస్తున్నారు.

Bheemla Nayak Release Poster

Also Read: Pawan Kalyan- Bheemla Nayak: టికెట్‌ రేట్లు ఎలా ఉన్నా ‘భీమ్లా నాయక్’ తగ్గదేలే

కాగా ఈ రిలీజ్ పోస్ట‌ర్లను చూసిన ప‌వ‌న్‌, రాణా అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఈ మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన అయ్యప్పునుమ్ కోశీయుమ్ మూవీకి రీమేక్ గా వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్ కు ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ మేనియాకు త‌గ్గ‌ట్టు క‌థ‌లో కొన్ని మార్పులు కూడా చేశారు.

ఇక అహంకారం, డ‌బ్బు ఉన్న వ్య‌క్తికి అలాగే ఆత్మ గౌరవంతో ప‌నిచేసే పోలీస్ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాల‌తో ఈ మూవీ తెర‌కెక్క‌తోంది. ఈ రెండు పాత్ర‌ల‌కు అత్యంత ప్రాముఖ్య‌త ఉంటుంది. హీరోకు ఏ మాత్రం త‌క్కువ కాదు అన్న‌ట్టు ఉంటాడు అవ‌త‌లి వ్య‌క్తి. అందుకే రాణాను ఇందులో ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. అయినా ప‌వ‌న్ ప‌దిమెట్లు పైనే ఉంటాడ‌నే ప్రచారాన్ని ద‌గ్గుబాటి అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రి ఇందులో రాణా పాత్ర‌ను ఏ మేర‌కు చూపిస్తారో అన్న‌ది చూడాలి.
Also Read: Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ డబ్బింగ్ పూర్తి చేసిన పవన్.. ప్రీ రిలీజ్​ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్

Tags