Victory Venkatesh: టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్.. లేడీస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే మన అందరి మైండ్ కి స్ట్రైక్ అయ్యే పేరు విక్టరీ వెంకటేష్.. ఏ హీరోకైనా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వస్తే వెంకటేష్ తో పోలుస్తారు.. ఆయన బ్రాండ్ ఇమేజి అలాంటిది మరీ.. అందుకే ఇప్పటికీ కూడా ఆయన సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ వస్తే అద్భుతమైన కలెక్షన్స్ వస్తుంటాయి.. కామెడీ అయినా , సెంటిమెంట్ అయినా , మాస్ అయినా వెంకటేష్ కి తిరుగులేదు.

ఇలా అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో గా వెంకటేష్ నిలిచాడని చెప్పొచ్చు..మల్టీస్టారర్ సినిమాలతో టాలీవుడ్ సరికొత్త ట్రెండ్ ని కూడా పరిచయం చేసిన హీరో వెంకటేష్.. ఈ ఏడాది ఆయన చేసిన మరో మల్టీస్టారర్ F3 చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..ఇది ఇలా ఉండగా.. వెంకటేష్ గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
వెంకటేష్ కోసం టాలీవుడ్ టాప్ నిర్మాతలైన నాగ వంశీ , జ్ఞానవేళ్ రాజా, వెంకట్ బోయినపల్లి వంటి వారు డేట్స్ కోసం క్యూ కడుతున్నా వెంకటేష్ వాళ్ళని హోల్డ్ లో పెట్టేసాడట.. ఆయనకీ నచ్చే విధంగా కథలను డైరెక్టర్స్ చెప్పలేకపోతున్నారట.. ఇప్పటికే హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ , శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ మరియు కళ్యాణ్ కృష్ణ వంటి డైరెక్టర్స్ వెంకటేష్ తో సినిమాలు చెయ్యడానికి సంప్రదించారట.. కానీ వెంకటేష్ ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్నాడని.. ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత మీ కథలు విని ఏదో ఒకటి ఓకే చేస్తాడని నిర్మాత సురేష్ బాబు చెప్తున్నాడట.. గతంలో సంపత్ నంది , త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్స్ కూడా వెంకటేష్ కి కథలు వినిపించారు.. కానీ ఎందుకో ఆయనకీ అవి నచ్చలేదు.

అయితే తాజాగా వెంకటేష్ తన చిరకాల మిత్రుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు..ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.. అయితే వెంకటేష్ తెలుగులో ఒక సినిమా చెయ్యడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు.. దీంతో వెంకటేష్ కి సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయిందా..? త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి