Ramgopal Varma : జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధ్యమే. మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే అకుంఠిత శ్రమ, పట్టుదల, సహనం ఉండాలి. లేకపోతే మనం అనుకున్న గమ్యం చేరడం సాధ్యం కాదు. ఉత్తములు దేన్నయినా సాధించేదాకా విశ్రమించరు. మధ్యములు మధ్యలోనే వదిలేస్తారు. ఇక చివరి వారు అధములు అసలు పని మొదలు పెట్టడానికే ముందుకు రారు. ఇలా ఏదైనా సాధించాలనే తపన ఉంటే పరిస్థితులను మనకు అనుకూలంగా చేసుకోవాలి కానీ పరిస్థితులకు మనం అనుకూలంగా మారడం కాదు. ఈ నేపథ్యంలో మన జీవితంలో మనకు కొన్ని పేజీలు దక్కాలంటే మనం కష్టపడక తప్పదు.
రాంగోపాల్ వర్మ
పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. స్వయంకృషితో ఎదిగిన దర్శకుల్లో ఆయన ఒకరు. ఇండస్ల్రీలో ఆయన గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. ఆయన జీవితం గురించి తీస్తే ఓ సినిమా అవుతుంది. రాస్తే ఓ పుస్తకంలా మారుతుంది. అంతటి ఘనమైన చరిత్ర ఆయన సొంతం. ఆయన కూడా మనలాగా కుర్ర వయసులో తప్పులు చేసిన వాడే. కాలం కలిసి రావడంతో దర్శకుడిగా మారి తనలోని ప్రతిభను బయటపెట్టాడు. శివతో అరంగేట్రం చేసిన ఆయన పలు విభిన్నమైన చిత్రాలు తీసి శభాష్ అనిపించుకున్నారు.
వండర్ క్రియేట్ చేసిన శివ
తెలుగు చలన చిత్ర రంగంలో శివ సంచలనం. శివ తరువాత తెలుగు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు యాక్షన్ సినిమాలు పెద్దగా ఆడేవి కావు. దీంతో శివ రాకతో ఈ సినిమాల ప్రభావం పెరిగింది. దర్శకుల్లో మార్పు వచ్చింది. తమ పంథా మార్చుకుని అందరు ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు. అలా తెలుగు చిత్ర సీమలో నూతన పంథా ఏర్పాటు చేసుకున్నారు. నాగార్జునకు శివ సినిమా ఇచ్చిన కిక్కు ఏ సినిమా కూడా ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. అంతలా శివ ట్రెండ్ క్రియేట్ చేయడం గమనార్హం.
కాలేజీ రోజుల్లోనే..
రాంగోపాల్ వర్మ కాలేజీ రోజుల్లోనే స్నేహితులకు కథలు చెప్పేవాడట. అది విని స్నేహితుడు నాకు డబ్బుంటే నీతో సినిమా తీస్తానని చెప్పడంతో ఆయనకు తన కథల మీద శ్రద్ధ కలిగింది. చదువు పూర్తయ్యాక హోటల్ తాజ్ లో నెలకు రూ.800 జీతానికి పనికి కుదిరాడట. తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రామోజీరావు, సురేష్ బాబాలను కలిసి సినిమా తీయాలని ఉందని అడగ్గా వారు ఎక్కడైనా పనిచేసి అనుభవంతో రా అవకాశం ఇస్తామని చెప్పడంతో కసిగా కథలు రాసుకుని చివరకు శివ కథతో దర్శకుడయ్యాడు.
వీడియో లైబ్రరీ..
పెళ్లయ్యాక హైదరాబాద్ లో ఓ వీడియో లైబ్రరీ పెట్టాడు. రోజు సినిమాలు చూసి చూసి విభిన్నమైన కథలు రాసుకునే వాడు. అందులో నుంచి పుట్టిందే శివ కథ. అలా రాంగోపాల్ వర్మ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు మంచి దర్శకుడిగా స్థానం సంపాదించుకున్నాడు. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవిందా, అనుకోకుండా ఒకరోజు, సత్య, రక్తచరిత్ర వంటి విభిన్న కథలతో సినిమాలు తీసి శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ గా ఆయనకు పేరు ఉంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Vermas first salary was 800 what did he do after love marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com