Venu Swamy
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేదు. జ్యోతిష్యం చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి చెబుతూ మరింత ఫేమస్ అయ్యారు ఈ జ్యోతిష్యుడు. కానీ ఈ మధ్య ఆయన చెప్పే విషయాలు ఏవి కూడా నిజం అవడం లేదు. దీంతో విమర్శల పాలవుతున్నారు వేణు స్వామి. గతంలో సమంత నాగచైతన్యల విషయంలో, మరి కొందరి సెలబ్రెటీల విషయంలో ఈయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజం అయ్యాయి. కానీ ప్రస్తుతం ఈయన వాక్కును నమ్మడం లేదు ప్రజలు.
జరగబోయే విషయాలు చెప్పడం మాత్రమే కాదు. దోషపరిహారం కూడా చేస్తారు. ఇప్పటికే ఈయన ఎంతో మంది స్టార్ హీరోహీరోయిన్ ల కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈయన సెలబ్రెటీలకు మాత్రమే కాదు సాధారణ ప్రజలకు కూడా జాతకాలు చెబుతానని పలు సందర్బాల్లో వెల్లడించారు. మరి ఈయన జాతకం చెబితే ఎంత తీసుకుంటారు అనే సందేహం ఉందంటున్నారు నెటిజన్లు. దోషాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఈయన ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది.
సాధారణంగా అయితే గంటకు రూ. 5000 వేలు చెల్లించాలట. అయితే గంటకు ఐదు వేలు అంటే మామూలు విషయం కాదు. ఈ రేంజ్ లో డబ్బులు వసూలు చేస్తే సాధారణ ప్రజలు ఎలా చెల్లిస్తారు అని విమర్శిస్తున్నారు ఈయన జాతకాలను నమ్మేవారు. కానీ సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు ఈయన మరింత ఎక్కువ ఛార్జ్ చేస్తారని టాక్. ఇందులో నిజం ఎంత అనేది ఆయన చెబితేనే తెలుస్తోంది. అయితే వేణు స్వామి కేవలం జ్యోతిష్యం చెబుతూ మాత్రమే సంపాదించరట.. ఈయన పబ్ ను కూడా రన్ చేస్తారు. ఈ పబ్ ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే టాక్ ఉంది.