Nagarjuna On Shobha Shetty: శోభ శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అనడంలో సందేహం లేదు. తన యాటిట్యూడ్, విలనీ ఎక్సప్రెషన్స్, ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకులను ఎంతగా టార్చర్ చేయాలో అంతగా చేసింది. శోభ శెట్టిని ఎలిమినేట్ చేయండి బాబోయ్ అని మెజారిటీ ఆడియన్స్ రిక్వెస్ట్ చేసినా… ఆమెను బయటకు పంపలేదు. సీరియల్ బ్యాచ్ ఆల్రెడీ ఒప్పందం ప్రకారమే హౌస్లో అడుగుపెట్టారనే వాదన. ఈ క్రమంలో శోభ శెట్టిని బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుకుంటూ వచ్చారనే విమర్శలు వినిపించాయి.
శోభ శెట్టి కోసం టాప్ కంటెస్టెంట్స్ ని బలి చేశారు. ఎట్టకేలకు విమర్శల మధ్య 14వ వారం ఆమెను ఎలిమినేట్ చేశారు. బయటకు వచ్చాక శోభ శెట్టికి నిరసనల సెగ తగిలింది. ర్యాలీలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ వినిపించాయి. మీరు ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు వచ్చారంటూ ముఖానే అడిగారు.
హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టికి ఈ విషయం అర్థం అయ్యింది. బిగ్ బాస్ షో వలన తాను తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నానని అవగతం చేసుకుంది. అందుకే ఒకటి రెండు సందర్భాల్లో నేను ఏం చేసినా ఆటలో భాగమే. తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించాలని కోరుకుంది. ఇక బిగ్ బాస్ షో ద్వారా శోభ శెట్టి రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ రూపంలో ఆర్జించిందని సమాచారం. దీనికి అదనంగా నాగార్జున ఆమెకు రహస్యంగా ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడట.
నాగార్జున ధరించిన టీ షర్ట్ పై మనసు పడ్డ శోభ శెట్టి నాకు ఇస్తారా సార్? అని అడిగింది. అందుకు నాగార్జున జస్ట్ నవ్వి ఊరుకున్నాడు. ఏ విషయం చెప్పలేదు. అయితే షో ముగిశాక ఆమెకు నాగార్జున కోరుకున్న టీ షర్ట్ ఇచ్చాడట. బిగ్ బాస్ హోస్ట్ కోసం కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా ఎంపిక చేశారు. నాగార్జున ధరించిన ఒక్కో టీ షర్ట్ ధర రెండు లక్షల రూపాయాల పైనే. అంత విలువైన గిఫ్ట్ ని శోభ శెట్టికి నాగార్జున రహస్యంగా ఇచ్చాడట. శోభ శెట్టి సదరు టీ షర్ట్ ధరించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మేటర్ బయటకు వచ్చింది.