India Vs Afghanistan T20: ఇక ఈ సంవత్సరం జూన్ లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇండియన్ టీం దానికోసం ఇప్పటి నుంచే చాలా కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే టి20 వరల్డ్ కప్ కి ముందు ఇండియన్ టీం ఒక్క టి20 సిరీస్ మాత్రమే ఆడబోతుంది అది కూడా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడాల్సి ఉంది. అయితే ఈ టి20 సిరీస్ కి సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు అందుబాటులోకి వస్తారా లేదా అనే విషయం మీద చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఈ సీనియర్ ప్లేయర్లు ఇద్దరు టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో ఆడాల్సి ఉంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఈ సిరీస్ లో ఉంటారు.
ఇక అలా కాకుండా ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో ఈ సీనియర్ ప్లేయర్లు కీలకపాత్ర వహించబోతున్నారు కాబట్టి వాళ్లకు అఫ్గాన్ తో టి 20 సిరీస్ ఆడే అవకాశం లేకుండా విశ్రాంతి ని ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళకి విశ్రాంతి ఇచ్చినట్లయితే అఫ్గాన్ తో ఆడే టి20 సీరీస్ కి కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం గా మారింది. ఇప్పటికే హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ ఇద్దరూ కూడా గాయాల బారిన పడడంతో ఈ సిరీస్ కి కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది కూడా కీలకమైన అంశంగా మారింది…
అయితే ఈ సిరీస్ కి కేఎల్ రాహుల్ గాని, శ్రేయస్ అయ్యర్ గాని కెప్టెన్ లుగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వీళ్లకు కూడా విశ్రాంతినిచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫ్గాన్ టీం ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు టి20 మ్యాచ్ లో ఇప్పటికే చాలా విజయాలను అందుకుంటూ వస్తున్నారు… అయితే టెస్ట్ సీరీస్ లో అదరగొట్టిన బుమ్రా ,సిరాజ్ లకు ఈ సిరీస్ లో విశ్రాంతిని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకు విశ్రాంతిని ఇచ్చినట్లయితే ముఖేష్ కుమార్,అవెజ్ ఖాన్, హర్షదీప్ సింగ్ లు పేస్ విభాగంలో సత్తా చాటబోతున్నారు అనేది స్పష్టం గా తెలుస్తుంది…
ఇక ఈ మ్యాచ్ లను కనక చూసుకుంటే…
జనవరి 11 న మొదటి టి 20 మ్యాచ్ మొహాలీ లో జరుగుతుంది…
జనవరి 14 న రెండోవ టి 20 మ్యాచ్ ఇందౌర్ లో జరుగుతుంది…
జనవరి 17 న మూడోవ టి 20 మ్యాచ్ బెంగుళూర్ వేదికగా జరుగుతుంది…