
Vastu Tips For Home: మనం కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా వాస్తు ప్రకారం ఉందా లేదా అనేది చూసుకుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఉత్తర ప్రధాన ద్వారం ఉండే ఇల్లు శుభప్రదమైనదిగా చెబుతుంటారు. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కావడంతో ఉత్తర ముఖంగా ఉండే ఇల్లు సకల సంపదలకు నిలయంగా మారుతుందని నమ్ముతారు. అందుకే ఉత్తర ముఖంగా ఉండే ఇల్లునే కొంటారు. స్థలం కూడా అదే విధంగా ఉంటే మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుందని అంటారు. వాస్తు ప్రకారం ఉత్తరాన్ని కుబేరుడి దిక్కు అని పిలుస్తారు. అందుకే దీనికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు.
ఉత్తరం వైపు ద్వారం ఉంటే..
ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మాస్టర్ బెడ్ రూం నైరుతి దిశలో ఉండేలా చూసుకుంటే మంచిది. పూజా గది ఈశాన్యంలో ఉంచుకోవాలి. ఉత్తర గోడలో కుబేరుని యంత్రం అమర్చుకోవాలి. లివింగ్ రూం ఈశాన్య దిశలో ఉంచుకోవాలి. అతిథి గది వాయువ్య దిశలో ఉండాలి. వంట గది వాయువ్య లేదా ఆగ్నేయ దిశలో ఉంటే మంచిది. ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటుంది. ఇలా ఉత్తర ప్రధాన ద్వారంగా ఉన్న ఇంట్లో ఉండేవారు ఇలాంటి పద్ధతులు పాటిస్తే సరి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఉత్తర దిశ
ఉత్తర దిశలో ఇల్లు నిర్మించినా ఉత్తరం వైపు ఉన్న ఆస్తిని కొనుగోలు చేసినా మనకు మంచి జరుగుతుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉత్తరం వైపు ఉన్న ఇళ్లను ఈశాన్య దిక్కుగా విస్తరించాలి. ఈ ఇళ్లలో ఉండే స్త్రీలు నాయకత్వ లక్షణాలు కలిగిన వారై ఉంటారు. కుబేరుడి విగ్రహాన్ని ఉత్తరం వైపు పెడితే మనకు మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిశలో తులసి మొక్కను నాటితే పాజిటివ్ ఎనర్జీ దక్కుతుంది. ఈశాన్య దిశలో కూడా నాటుకుంటే మంచిదే.

ఈశాన్యం వైపు..
ఈశాన్యం వైపు మెట్లు ఉండకూడదు. వేచి ఉండే గది కూడా ఉండకుండా చూసుకోవాలి. వాయువ్య దిశలో అతిథి గది ఉండేలా చూసుకోవాలి. మెట్లు, లివింగ్ రూం, బాత్ రూంలకు సౌత్ ఈస్ట్ అనుకూలంగా ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంకులు, మెట్లు దక్షిణం వైపు బాగుంటుంది. ఇలా ఉత్తర అభిముఖంగా ఇల్లు కట్టుకున్న వారు జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు ప్రయోజనాలు దక్కుతాయి. కష్టాలు లేకుండా ఇల్లు సాఫీగా సాగాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. ఈ విషయం తెలుసుకుని మసలుకుంటే మనకు వాస్తు ఫలితాలు సిద్ధిస్తాయి.