Vastu Tips: మనదేశంలో వాస్తుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాస్తు ప్రకారం చూసుకుంటాం. వాస్తు సరిగా లేకపోతే కట్టుకోవడానికి ఇష్టపడం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటేనే మంచి జరుగుతుందని అందరి విశ్వాసం. ఈ నేపథ్యంలో వాస్తుకు అంతటి విలువ ఇస్తున్నాం. ప్రతి దిక్కుకు ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈశాన్యం మనకు ఎంతో లాభదాయకమైన దిక్కుగా భావిస్తుంటాం. వాస్తు ఇంట్లోని కుటుంబసభ్యుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. మనకు జీవితంలో కలిసి రావాలంటే వాస్తు సరిగా ఉండాల్సిందే.

కరోనా కాలంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అది మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఆర్థిక ఇబ్బందులను కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో చేస్తన్న ఉద్యోగంలో మనం సరిగా ఉండకపోతే పోస్టింగ్ ఊస్టింగ్ కావడం సహజమే. దీంతో ఉద్యోగంలో రాణించాలన్నా ఇంటి వాస్తు ప్రధాన పోషిస్తుందని నమ్ముతుంటారు. దీనికి గాను కొన్ని చిట్కాలు పాటించి మన భవిష్యత్ ను బంగారుమయం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.
మనం ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతుంటాం. అందుకే ఇంట్లో సానుకూల శక్తులు ఉంటేనే మనకు లాభాలుంటాయి. మన ఇంటికి ఉత్తర దిశ కుబేర స్థానంగా చెబుతుంటారు. మనం ఇంట్లో కూర్చునే క్రమంలో ఈ దిశలోనే కూర్చుంటే మనకు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా వారు కచ్చితంగా ఉత్తరం దిశగా కూర్చోవడం శ్రేయస్కరం. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు ఈశాన్య మూలలో కూర్చుంటే మంచి ఫలితం ఉంటుంది.

తూర్పు దిశలో కూర్చుని ఉద్యోగ విధులు నిర్వహిస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ల్యాప్ టాప్, డెస్క్, టాప్ గానీ మొబైల్ కానీ చార్జింగ్ పెట్టుకునే గది ఆగ్నేయ మూలలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం చేసుకునే గదిలో విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసుకునే గదిలో ఎలాంటి శబ్ధాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసుకునే టేబుల్ పై భోజనం చేయకూడదు. దానిపై వస్తువులు చిందరవందరగా పడేయకూడదు.
వ్యాపారంలో బాగా రాణించాలన్నా వాస్తు పద్ధతులు పాటించాల్సిందే. వాయువ్య దిశలో మనం వ్యాపారం చేసే వస్తువులను ఉంచుకోవడం మంచిది. వాయువ్యంలో వాయుదేవుడు ఉండటంతో వ్యాపారంలో బాగా కలిసొస్తుందని చెబుతారు. ఇలా వాస్తు శాస్త్ర రీత్యా మనం జాగ్రత్తలు పాటించి జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాలి.