Vastu Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అనారోగ్యం దరిచేరితే అంతే సంగతి. పనులు సాగవు. అందుకే ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అందుకు తగిన మార్గాలు అన్వేషించాలి. పద్ధతులు పాటించాలి. అప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ప్రస్తుత కాలంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో మన ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే.

మనకు అనారోగ్యం కలిగితే మందులు వేసుకోవడం తప్పనిసరి. అవి దాచుకునే చోటును కూడా ఎంపిక చేసుకోవాలి. సరైన దిశలో మందులు పెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవు. వాస్తు ప్రకారం చూసుకుంటే మనం మందులను ఏ దిశలో ఉంచుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందో తెలుసుకుంటే మంచిది. లేదంటే తిప్పలు తప్పవు. మందులు సరైన దిశలో దాచుకోకపోతే అనారోగ్యమే పలకరిస్తుంది. జీవితంపై ప్రతికూల ప్రభావాలే కలుగుతాయి. ఔషధాలను జాగ్రత్తగా దాచుకునే చోటు కూడా వాస్తు శాస్త్ర రీత్యా ప్రయోజనకరంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు.
వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య దిశల్లో ఉంచుకోవడమే మంచిది. ఈ దిశల్లో మందులను ఉంచుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది. వాస్తు పద్ధతులు పాటిస్తేనే ప్రయోజనకరం. వ్యాధులను నియంత్రించే క్రమంలో మనం అలవాట్లు మార్చుకోవాలి. మందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ, ఆగ్నేయ దిశల్లో ఉంచితే ప్రతికూల ప్రభావాలే కనిపిస్తాయి. ఎప్పుడైనా ఆ దిశల్లో మందులు ఉంచుకోకుండా చూసుకోవాలి. పొరపాటున దక్షిణ, ఆగ్నేయ దిశల్లో మందులు ఉంచితే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమే. మరిచిపోయి ఈ దిశల్లో మందులు ఉంచుకుని వేసుకుంటే రోగాలు మాత్రం నయం కావు. సమస్య మరింత తీవ్రమవుతుంది.

వాస్తు ప్రభావ రీత్యా వంట గదిలో ఉంచుకోవడం కూడా అంత మంచిది కాదు. మనం వేసుకునే మందులే అయినా వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అపసవ్య దిశలో ఉంచితే అనర్థాలే వస్తాయి. అందుకే మంచి దిశలో దాచుకుని వాటిని మన ఆరోగ్యం కాపాడేలా చేసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వాడుకుని ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం రోగాల బారిన వారిపై ఉంటుంది. ఇప్పుడు తెలిసింది కదా మందులు ఎటు వైపు ఉంచుకుంటే మంచిదో తెలిసింది కదా. అందుకే మందులు ఆ దిశల్లోనే దాచుకునేందుకు ప్రయత్నిస్తే సరి.