Mauni Amavasya 2023:అమావాస్య అంటే అందరికి భయమే. ఈ రోజు అందరు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతారు. మరో నాలుగు రోజుల్లో అమావాస్య రానుంది. దీన్ని మౌని అమావస్యగా పిలుస్తారు. ఈ రోజు మనం కొన్ని పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీంతో మనకు ఎంతో మేలు కలుగుతుందని భావిస్తున్నారు. అమావాస్య, పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని పనులు చేస్తే మేలు కలుగుతుందని నమ్ముతారు. ఇప్పుడు వచ్చే అమావాస్యకు ప్రాధాన్యం ఉంది.

అమావాస్యను చెడుకు ప్రతీకగా చెబుతారు. ఎలాంటి పనులు చేపట్టడానికి కూడా ఇష్టపడరు. మరో ఐదు రోజుల్లో వచ్చే అమావాస్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రోజు కొన్ని పనులు చేస్తే మనకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. అమావాస్యల్లో మౌని అమావాస్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. జపం, తపస్సు, ధ్యానం చేయడం వల్ల మనకు బాధలు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజు పూర్వీకులకు దానం, పిండ ప్రదానం చేయడంతో మంచి జరుగుతుంది.
అమావాస్య రోజు దిష్టి పోవడానికి, చెడు ప్రభావాలు దూరం కావడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శని భగవానుడి అనుగ్రహం కోసం అనేక పరిహారాలు చేస్తుంటారు. ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేయకపోయినా ఇది చేయడం వల్ల మంచి జరుగుతుందని భావించొచ్చు. ఈ పరిహారం చేయడంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తులు కావొచ్చు. నరదిష్టి, నరదోషాన్ని తొలగించేందుకు ఉపకరిస్తుంది. ఆరోగ్యం కలిగేలా చేస్తుంది. జనవరి 21న వచ్చే మౌని అమావాస్యకు అంతటి విలువ ఉండటంతో దీన్ని పాటించాలని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు ఇంట్లో పసుపు, కుంకుమ, ఉప్పు, నిమ్మకాయలతో చేసే పరిహారంతో మన ఇంటికి పట్టే నరదిష్టి తొలగుతుంది. దీంతో మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఈ పరిహారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు చేయాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 5 తరువాత చేసేందుకు సిద్ధమవ్వాలి. నిమ్మకాయను తీసుకుని రెండు వక్కలు చేసి పసుపు, కుంకుమ నీళ్లలో ముంచాలి. ఇంటి ముందు రెండు పక్కల ఉప్పు పోసి అందులో రెండు చెక్కలను రెండు పక్కల ఉంచాలి. దీంతో మన ఇంటికి దిష్టి దోషం పోతుందని చెబుతున్నారు.

అమావాస్య రోజు ఇవి పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. శనిపీడలు తొలగిపోతాయి. ఉప్పుకు, నిమ్మకాయకు ఎంతో శక్తి ఉంటుంది. చెడు పోయేలా చేస్తాయి. మౌని అమావాస్య రోజు దానం చేయడం వల్ల డబ్బుకు కానీ బట్టలు లేదా ఆహారం ఏదైనా దానం చేయడం వల్ల నారాయణుడి కటాక్షం ఉంటుంది. పేదవారికి దానం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.