Vastu Sleep: మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు నియమాలు పాటిస్తుంటాం. వాస్తు ప్రకారం పద్దతులు పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది. చాలా మంది ఇష్టారాజ్యంగా వాస్తు నియమాలు పాటించకుండా ఇల్లు కట్టుకుని తరువాత దాని పర్యవసానాలు అనుభవిస్తుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడం, రాత్రుళ్లు మేల్కోవడం, ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలతో నిరంతరం బాధపడటం జరుగుతుంది. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వాస్తు ఇబ్బందులు మనల్ని సమస్యలకు గురిచేయవు. ప్రశాంతమైన జీవనం గడపాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇల్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపాలి.

గ్రహాల పరిస్థితుల కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక, మానసిక ఒత్తిడితో అనారోగ్యాల బారిన పడుతుంటారు. రాహు గ్రహ అననుకూల ప్రభావం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. శారీరక అనారోగ్యంతో సమస్యలు పెరుగుతాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే పడక గదిలో గంధపు పరిమళాలు వెదజల్లేలా చూసుకోవాలి. గదిలో గంధపు నీళ్లు చల్లాలి. రాహు దోషాన్ని తొలగించుకుంటే నిద్ర బాగా పడుతుంది. మంచిగా నిద్ర పట్టాలంటే దిండు కింద రెండు బార్లీ గింజలు ఉంచుకుని పడుకోవాలి. ఉదయాన్నే వాటిని పక్షులకు ఆహారంగా వేయాలి. దీంతో నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
పడక గదిలో మంచం కింద దుమ్ము ధూళి, చెప్పులు, బూట్లు, పనిచేయని ఎలక్ర్టిక్ వస్తువులు ఉంచుకోవడం సురక్షితం కాదు. పొరపాటున ఇవి ఉంటే శాశ్వత నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. అందుకే మంచం కింద ఏమి లేకుండా జాగ్రత్త పడితే మంచిది. బెడ్ షీట్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ కాలం మురికిగా ఉంటే నిద్ర సరిగా పట్టదు. రెండు రోజులకోసారి అయినా వాటిని ఉతికి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మురికిగా ఉన్న బెడ్ షీట్లపై పడుకుంటే ప్రతికూల ప్రభావం కలుగుతుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

మంచం కింద పాత బట్టలు, సామన్లు, ఇతర వస్తువులు పెట్టకూడదు. మంచి నిద్ర లేకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తిండి, నిద్ర సరిగా ఉండకపోతే అనారోగ్యం దరిచేరుతుంది. ఫలితంగా మనిషి ఆయుష్షు కూడా తగ్గుతుంది. ఈ క్రమంలో నిద్ర పోయేందుకు అనువైన పరిస్థితులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన నిద్రతోనే మనకు ఎంతో లాభం కలుగుతుంది. మన అవయవాలు సరిగా పనిచేసేందుకు నిద్ర ప్రధానంగా ఉపయోగపడుతుంది.