sandhya theater : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక హవాను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. దీని వల్ల ప్రతి ప్రేక్షకుడు తమ తమ అభిమాన హీరోల సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు స్టార్ హీరోలుగా మారడమే కాకుండా ప్రేక్షకులకు అమితమైన ఎంజాయ్ మెంట్ ను కూడా అందిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించింది. మరి ఈ సినిమా సక్సెస్ లో భాగంగానే సినిమా యూనిట్ చాలా సంబరాలను జరుపుకుంటున్న నేపధ్యం లో సంధ్య థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకు అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాలో రేవతి అనే మహిళా తన ప్రాణాలను కోల్పోయిన విషయం మనకు తెలిసిందే… ఇందులో భాగంగానే థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ మీద కూడా కేసు అయింది. మరి అందులో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటకి వచ్చినప్పటికి థియేటర్ యాజమాన్యం మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పోలీస్ శాఖ నుంచి ఒక నోటీస్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సంధ్య థియేటర్ ని బ్యాన్ ఎందుకు చేయకూడదనే విషయం మీద పది రోజుల్లో సరైన సమాచారాన్ని తెలియజేయాలని లేకపోతే మాత్రం థియేటర్ ని సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఎంతోమంది హీరోలకు ఎమోషన్ గా మారిన సంధ్య థియేటర్ ని ఇప్పుడు క్లోజ్ చేసే సమయం రావడం అనేది ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడితో పాటు హీరోలను కూడా చాలా వరకు కలవర పెడుతుందనే చెప్పాలి. ఎందుకు అంటే సంధ్య థియేటర్ లో మొదటి రోజు సినిమా చూసి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన హీరోలు చాలామంది అనుకుంటారు.
సంధ్య థియేటర్లో మొదటి షో సినిమా చూడాలనే సెంటిమెంట్ తో ఉన్న హీరోలు కూడా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ థియేటర్ ని క్లోజ్ చేయడం వల్ల ఇటు ప్రేక్షకులకు అటు సినిమా ధియేటర్ యాజమాన్యానికి భారీగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడు థియేటర్ క్లోజ్ అవుతుందా? లేదంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ని విధించి థియేటర్ ను ఓపెన్ వేసుకోవచ్చు అనే విధంగా తీర్పు ను ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది…అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ దీని మీద స్పందించి ఇల్డాంటివి జరగకుండా చూసుకుంటాం థియేటర్ ను క్లోజ్ చేయకండి అని కోర్టు కి చెబితే బాగుంటుంది…