
వనిత విజయ్ కుమార్ అంటే సౌత్ ఇండియాలో తెలియని వారుండరు. అలా అని ఆమె ఓ స్టార్ హీరోయిన్ అనుకుంటే పొరపాటే. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఎవరో ఒకరితో గొడవలు పడుతూ మీడియా దృష్టిని ఆకరిస్తూ ఉంటారు ఈమె. ప్రముఖ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల పెద్ద కూతురైన వనిత విజయ్ కుమార్ ఇప్పటికే లెక్కకు మించిన వివాదాలతో రచ్చ చేశారు. ఇద్దరికి విడాకులు ఇచ్చిన వనిత విజయ్ కుమార్, ముచ్చటగా నిర్మాత పీటర్ పాల్ ని మూడో వివాహం చేసుకున్నారు.
Also Read: సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. కేరాఫ్ ఆఫ్ ‘గచ్చిబౌలి’
అలా హనీమూన్ ముగిసిందో లేదో అతను తాగి రచ్చ చేస్తున్నాడని, తన్ని బయటికి గెంటేసింది. ఈ పెళ్లి కూడా పెటాకులే అని వార్తలు వస్తుండగా… ఎవరినో ప్రేమిస్తున్నానని మరో బాంబు పేల్చింది. కన్న తండ్రి విజయ్ కుమార్ పైనే కేసుపెట్టిన వనిత కొత్త కాంట్రవర్సీకి తెరలేపింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకప్పుడు తనకు లైన్ వేశాడని ఓపెన్ గా చెప్పేసింది. చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలు చెన్నైలో ఉన్నప్పుడు, విజయ్ కుమార్ కుటుంబం వాళ్ళతో సన్నిహితంగా ఉండేవారట. ఒకరి ఇంటికి మరొకరు రావడం, వేడుకలలో పాల్గొనడం జరిగేదట. కాగా చిరంజీవి నటిస్తున్న ఓ కొత్త సినిమా ఓపెనింగ్ కి తండ్రితో కలిసి వనిత అక్కడి వెళ్లగా, ట్రెండీగా డ్రెస్ చేసుకొని ఉన్న అల్లు అర్జున్ తనకు సైట్ కొట్టాడని ఆమె చెప్పారు.
Also Read: యూపీలో దారుణ ఘటన.. చపాతీలు చల్లగా ఉన్నాయని తుపాకితో కాల్చిన కస్టమర్..?
ఆ రోజు తానూ గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి ఉండగా.. ఫోన్ చేసి ఆ విషయం తనకు గుర్తు చేసినట్లు వనితా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకంటే వయసులో చిన్నవాడైన అల్లు అర్జున్ నాకు లైన్ వేశాడని ఆమె చెప్పడం ఆసక్తి రేపింది. ఇక అల్లు అర్జున్ డాన్స్ లు అంటే మహా ఇష్టం అని ఆమె చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ తన ఫేవరేట్ హీరోయిన్ అని చెప్పిన వనిత, అతనితో నటించాలని ఉందని అన్నారు. రమ్యకృష్ణ మాదిరి పవర్ ఫుల్ లేడీ రోల్స్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం