
హిందూ మత విశ్వాసాలపై వైసీపీ కుట్రపూరితంగా దాడి చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను వైసీపీ నేతలు, మంత్రులు దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల కొండపై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం టీటీడీ నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్నారు.. మీ ప్రచార ఆర్బాటం కోసం తిరుమలను వేదికగా వాడుకుంటారా అని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల కొండపై డ్రోన్లు ఎగురవేస్తారా అని తప్పుబట్టారు. ద్వారకా తిరుమలలోనూ వైసీపీ నేతలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం వైసీపీ విధానాలకు నిదర్శనమన్నారు. ద్వారకా తిరుమల ఆలయ బోర్డు ఛైర్మన్ మేడిపల్లి గంగరాజు కూడా ఆలయంలో చెప్పులతో తిరగడం..ఇవన్నీ దేనికి సంకేతమని బోండా ఉమా నిలదీశారు.