
Vangaveeti Radha Krishna -Nara Lokesh: వంగవీటి రాధాక్రిష్ణ.. ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒకేఒక సారి ఎమ్మెల్యే అయ్యారు, తరువాత రెండుసార్లు పోటీచేసినా ఓటమే ఎదురైంది. మోహన్ రంగా వారసుడిగా ఉండే ఇమేజ్ ను దాటుకొని సకాలంలో రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మోహన్ రంగా వారసుడిగా ఎంపీ, ఎమ్మెల్యేగా కాకుండా రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసేలా ప్రబలమైన శక్తిగా ఎదగాలని అభిమానులు, అనచురులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. జనసేన బాధ్యతలను రాధాకు అప్పగించనున్నట్టు టాక్ నడిచింది. ఇటువంటి తరుణంలో ఆయన టీడీపీ యువనేత నారా లోకేష్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: CM Jagan- AP employees: ఏపీ ఉద్యోగులకు.. సీఎం జగన్ కు తేడా అదే
2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రాధా అరంగేట్రం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవికి అండగా నిలబడ్డారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పోటీచేసినా ఓటమే ఎదురైంది. గత ఎన్నికల ముందు వైసీపీ నాయకత్వంతో విభేదాలతో అనూహ్యంగా టీడీపీలో చేరారు. చంద్రబాబు రాధాకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పటి నుంచి టీడీపీలో ఉన్నా ఏమంత యాక్టివ్ గా లేరు. కానీ రాధాపై రెక్కి నిర్వహించారన్న వార్తలు హల్ చల్ చేశాయి. ఆ సమయంలో చంద్రబాబు పరామర్శించడంతో పాటు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయితే మధ్యలో రాధాక్రిష్ణ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఒత్తిడి చేశారని టాక్ నడిచింది. కానీ అదంతా ఉత్త ప్రచారంగా తేలిపోయింది. రాధా స్నేహాన్ని వారిద్దరూ అడ్వాంటేజ్ తీసుకున్నారన్న ప్రచారం అయితే ఉంది. వంగవీటి మోహన్ రంగాకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. గుడివాడతో పాటు గన్నవరంలో సైతం ఉన్నారు. కాపు సామాజికవర్గం కూడా ఉంది. గత ఎన్నికల్లో రాధాను అడ్డంపెట్టుకొని వారు కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు కూడా రాధా ఏదైనా కార్యక్రమానికి హాజరైతే .. అదే సమయానికి అక్కడకు చేరిపోవడం.. మీడియాకు లీకులివ్వడం చేస్తున్నారు. కానీ దీనిని రాధా లైట్ తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను కలిసి సుదీర్ఘంగా చర్చించడం ఏమై ఉంటుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం లోకేష్ తో కలిసి రాధా అరగంట పాటు పాదయాత్రలో నడిచారు. తరువాత రెండు గంటల పాటు ఏకంతంగా చర్చించారు. ఇటీవల రాధా జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. టీడీపీలో ఉంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చే చాన్స్ లేకపోవడంతో జనసేనలో చేరి పోటీచేస్తారని టాక్ నడిచింది. జనసేన సైతం రాష్ట్ర స్థాయిలో రాధా సేవలను వినియోగించుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీ సైతం రాధాక్రిష్ణకు మంచి గుర్తింపే ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచార బాధ్యతలు అప్పగించి.. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక పోస్టు కట్టబెట్టేందుకు లోకేష్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే రాధా సైతం ఇక వారంలో రెండు రోజుల పాటు యువగళం పాదయాత్రలో పాల్గొంటానని ప్రకటించడం విశేషం.
Also Read:International Women’s Day 2023: ఉమెన్స్ డే: పడిలేచిన హీరోయిన్ల కథ..
