NTR And Balakrishna- Rajamouli: ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీలో బాలయ్య డ్యాన్స్.. వోడ్కా తాగేసి రాజమౌళి రచ్చ

NTR And Balakrishna- Rajamouli: ప్రస్తుతం ఎలా ఉన్న మన టాలీవుడ్ హీరోల పాత జ్ఞాపకాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులను వెంటాడుతూనే ఉంటాయి.అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అంత స్నేహంగా ఉంటారు, ఎందుకు అభిమానుల మధ్య మాత్రం అన్ని గొడవలు ఏర్పడుతాయి అనే సందేహం రాక తప్పదు.ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతాయో ప్రతీ రోజు మనం గమనిస్తూనే ఉన్నాం. Also […]

Written By: Neelambaram, Updated On : March 8, 2023 11:50 am
Follow us on

NTR And Balakrishna- Rajamouli

NTR And Balakrishna- Rajamouli: ప్రస్తుతం ఎలా ఉన్న మన టాలీవుడ్ హీరోల పాత జ్ఞాపకాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులను వెంటాడుతూనే ఉంటాయి.అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అంత స్నేహంగా ఉంటారు, ఎందుకు అభిమానుల మధ్య మాత్రం అన్ని గొడవలు ఏర్పడుతాయి అనే సందేహం రాక తప్పదు.ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతాయో ప్రతీ రోజు మనం గమనిస్తూనే ఉన్నాం.

Also Read: Nandamuri Family: పేరు గొప్ప ఊరు దిబ్బ… నందమూరి కుటుంబంలో ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో!

#RRR సినిమా తో అయినా ఈ ఇరువురి హీరోల అభిమానులు కలిసిపోతారు అనుకుంటే,మరింత గొడవలు పెంచేసాయి.ప్రతీ అంశం లో పోల్చుకుంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పరస్పరం కొట్టుకుంటూనే ఉన్నారు.ఈ సందర్భంగా 12 ఏళ్ళ క్రితం డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు బాలయ్య గురించి వేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

ఎన్టీఆర్ తన పుట్టినరోజు కి 2010 వ సంవత్సరం లో టాలీవుడ్ సెలెబ్రిటీలను పిలిచి ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు.ఈ పార్టీ లో రామ్ చరణ్ , రాజమౌళి మరియు బాలయ్య కూడా పాల్గొన్నాడు.వాళ్ళు చేసిన రచ్చ గురించి రాజమౌళి ఒక ట్వీట్ వేసాడు,ఆ ట్వీట్ లో ఆ మాట్లాడుతూ ‘నిన్న రాత్రి ఎన్టీఆర్ బర్త్ డే ని బాగా ఎంజాయ్ చేశాను.

NTR And Balakrishna- Rajamouli

గెస్ట్ గా వచ్చిన బాలయ్య బాబు తన డ్యాన్స్ తో మా అందరిని బాగా ఎంటర్టైన్ చేసాడు.ఇక రామ్ చరణ్ , ఎన్టీఆర్ వద్దు వద్దు అంటున్నా నా గొంతులో వోడ్కా పోశారు,బ్యాడ్ బాయ్స్’ అంటూ అప్పట్లో రాజమౌళి వేసిన ట్వీట్ ని అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.దీనిని బట్టీ రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు, ఎప్పుడో 12 ఏళ్లకు ముందు నుండే ఉంది అన్నమాట.

Also Read:Revanth Reddy- Gangavva: గంగవ్వ ప్రేమకు ఫిదా అయిన రేవంత్‌రెడ్డి!

Tags