Uttar Pradesh: ఆమె ఓ స్టేషన్ కు ఎస్సై. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారి. కానీ అకస్మాత్తుగా తన జీవితాన్ని ముగించింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారే ఉన్నపళంగా ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడు కాదన్నాడని తనువు చాలించింది. కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి ప్రియుడితో ఉండాలని చూసినా అతడి వేధింపులతో డ్రెస్ లో ఉండగానే ఆత్మహత్య చేసుకుంది. కన్నవారికి కడగండ్లు మిగిల్చింది. కుటుంబాన్ని పోషిస్తుందని భావించిన కూతురే లేకుండా పోవడంతో కన్నవారి కలలు కల్లలయ్యాయి. తమ కూతురు పోలీస్ ఇన్స్ పెక్టర్ అని గర్వంగా చెప్పుకునేందుకు అవకాశం లేకుండా చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గొసైగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలౌలీ అనే గ్రామంలో మున్నాలాల్ యాదవ్ కుమార్తె రష్మీ యాదవ్ మోహన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తోంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఏప్రిల్ 22న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల తరువాత విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Attack On YCP MLA: గోపాలపురం ఎమ్మెల్యేపై ప్రజలు దాడి చేయడానికి కారణాలేంటి?
రష్మీ యాదవ్ ఇన్ స్పెక్టర్ కాకముందు ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. అదే పాఠశాలలో సురేంద్ర సింగ్ కూడా పనిచేసేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే రష్మీయాదవ్ కు వివాహం కావడంతో విషయం భర్తకు తెలిసి అతడు విడాకులు తీసుకున్నాడు. దీంతో సురేంద్ర సింగ్ తో రష్మీ ప్రేమాయణం కొనసాగించింది.

ఈ నేపథ్యంలో ప్రియుడు సురేంద్ర సింగ్ కూడా రష్మీని అనుమానించాడు. మొగుడిని వదిలేసిన దానివని ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో మనసు నొచ్చుకున్న రష్మీ యాదవ్ ఇక తన జీవితం అక్కర్లేదని భావించింది. కుమిలికుమిలి ఏడ్చి చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో విషయం ఆమె తండ్రికి తెలియడంతో అతడు సురేంద్రసింగ్ పై కేసు నమోదు చేయించాడు. ఎంతో భవిష్యత్ ఉన్న రష్మీ అర్థంతరంగా జీవితం ముగించడం ఆందోళన కలిగించింది.
Also Read:Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే వైరల్