Trivikram Srinivas: త్రివిక్రమ్.. తెలుగు సినిమాలకు పంచ్ లు నేర్పిన గొప్ప మాటల రచయిత. వెండితెరపై తన మాటల తూటాలు పేల్చిన మాటల మాంత్రికుడు, జీవిత సత్యాలను చిన్న పలుకులోనే పలికించగల నేర్పరి త్రివిక్రమ్. సున్నితమైన హాస్యంతో నవ్వించాలన్నా, అనుబంధాల గురించి గుండె బరువెక్కేలా భావాన్ని పలికించాలన్నా ఈ తరంలో ఒక్క త్రివిక్రమ్ కే చెల్లింది. కేవలం తన మాటలతోనే మంత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది త్రివిక్రమ్ కి పెన్నుతో పెట్టిన విద్య.
మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన గొప్ప డైలాగ్స్ లో కొన్ని మీ కోసం.

బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం…బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం
కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
Also Read: Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే వైరల్
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు
జీవితం ఎలాంటిది అంటే.. ఇంట్రస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు.. ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రస్ట్ ఉండదు.
నిజం చెప్పకపోవడం అబద్ధం…అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం

యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు…ఓడించడం
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి…కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు
అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు…జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు
తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు
కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం… బాధ్యత లేని యవ్వనం…జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా…ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.

యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు
వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు
పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పొడు..
Also Read:Kajal Remuneration For Acharya: ఆచార్య సినిమా కోసం కాజల్ అగర్వాల్ కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా..!
Recommended Videos:
[…] […]
[…] Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి బాలీవుడ్ లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లోకి టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసిన ఈ బ్యూటీకి, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ అనే బిరుదుతో తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతూ ముందుకు పోతుంది. […]
[…] Acharya OTT Release: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది..దీనితో ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి మెల్లిగా తగ్గుతూ వచ్చేసింది..ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద కూడా చాలా తీవ్రంగా పడింది..చరిత్ర లో మొట్టమొదటిసారి మెగాస్టార్ సినిమాకి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం..దానికి తోడు వరుసగా రెండు పాన్ ఇండియన్ సినిమాలను జనాలు ఎగబడి చూడడం.. పెద్ద గాప్ లేకుండా ఆచార్య సినిమా రావడం..జనాలు మళ్ళీ డబ్బులు పెట్టి చూసేంత ఆసక్తి ఆచార్య సినిమా కలిగించకపోవడం.. దాని ప్రభావం కావాల్సిన హైప్ ని సొంతం చేసుకోలేకపోయిన ఆచార్య సినిమా పై పడడం తో అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా జరగడానికి కారణం అని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. […]