
Ustaad Teaser Review: ఆస్కార్ విన్నర్ కీరవాణి కుమారుల్లో ఒకరైన సింహ కోడూరి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో మిగతా వాళ్లకు భిన్నంగా ప్రయోగాత్మక సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నాడు. యమదొంగ, మర్యాద రామన్న, ఈగ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 2019లో విడుదలైన మత్తు వదలరా చిత్రంతో హీరో అయ్యాడు. మత్తు వదలరా చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా పర్లేదు అనిపించుకుంది.
తర్వాత తెల్లవారితే గురువారం చిత్రంలో నటించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ నిరాశపరిచింది. దొంగలున్నారు జాగ్రత్త అంటూ మరో ప్రయోగం చేశాడు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన దొంగలున్నారు జాగ్రత్త సైతం ఆకట్టుకోలేదు. నాలుగో చిత్రాన్ని మరో భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నాడు. తమ ఫ్యామిలీ బ్యానర్ వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఉస్తాద్ తెరకెక్కుతుంది. ఈ చిత్ర టీజర్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.
ఉస్తాద్ టీజర్ ఆకట్టుకుంది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ కథపై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. హీరో జీవితం ఒక డొక్కు బైక్, అలాగే విమానంతో ముడిపడి ఉన్నట్లు చూపించారు. ఎత్తుకు వెళితే కళ్ళు తిరిగే ఫోబియా ఉన్న హీరో ఫైలట్ ఎలా అయ్యాడనేది ఆసక్తి రేపుతోంది. సింహ కోడూరి పాత్ర ఆసక్తి రేపుతోంది. యంగ్ బ్యూటీ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సింహ-కావ్యా కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. హీరోయిన్ గా కావ్యా కళ్యాణ్ రామ్ కి ఇది మూడో చిత్రం. మసూద, బలగం చిత్రాలతో ఆమె బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. బలగం చిత్రం కావ్యా కళ్యాణ్ రామ్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో నటుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఉస్తాద్ చిత్రానికి ఫణిదీప్ దర్శకుడు. అకీవా బి సంగీతం అందిస్తున్నారు. ఉస్తాద్ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. టీజర్ ఆకట్టుగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
