US Winter Storm: సాధారణంగా క్రిస్మస్ వస్తే అమెరికా మొత్తం సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. ఈసారి 60 శాతం మంది ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. కరెంటు లేదు.. తాగేందుకు నీరు లేదు.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మొత్తానికి ప్రజలు నరకం చూస్తున్నారు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో 13 రాష్ట్రాలు అతలాకుతులమవుతున్నాయి.. మోంటానాలో -45.6 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే అక్కడ మంచు తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా “రాఖీ_ అపలిచియాన్” పర్వత శ్రేణిలో మంచు తీవ్రంగా కురుస్తోంది.. దీని దెబ్బకు మూడు లక్షల ఇళ్లల్లో చీకట్లు అలముకున్నాయి.

బాంబ్ దెబ్బ
అగ్రరాజ్యం అమెరికాపై బాంబు మంచు తుఫాను పంజా విసురుతున్నది. హరి కేన్ లను తలపించే విధంగా ఈదురుగాలు వీస్తుండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని 13 రాష్ట్రాలపై మంచు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల చాలా రాష్ట్రాల్లో అంధకారం అలముకున్నది.. తీవ్రస్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 28 మంది మృతి చెందారు.. ఇక మెక్సికోలోని శిబిరాల్లో శరణార్థులు మంచుకు గజగజ వణికి పోతున్నారు..
రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి
ఉత్తర అమెరికాలోని మోంటానా, వ్యోమింగ్ నగరాల్లో ఆదివారం రాత్రి -45.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోస్టన్, లింకన్, న్యూ యార్క్, చికాగో, మిషిగాన్ ప్రాంతాల్లో మైనస్ పది డిగ్రీల కంటే తక్కువలో ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణ శాఖ చెబుతోంది.. ఆదివారం సాయంత్రానికి మూడు లక్షల ఇళ్ళు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా లేక అంధకారం అలముకున్నది.. 60% జనాభా మంచు వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది.

ఇళ్లలోనే చలిమంటలు వేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.. చలి, మంచు కారణంగా అమెరికా వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 5,400 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై ముఖ్యంగా హైవేలపై పేరుకుపోయిన మంచు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.. ఇక జపాన్ లోనూ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు.. మంది గాయపడ్డారు.. జపాన్ లోని హోక్వయిడో కురుస్తున్న మంచు వల్ల చలిగాలులు వీస్తున్నాయి. 1.2 మీటర్ల ఎత్తులో మంచి పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. యమగాట, ఒగుని, గిపూ లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. పలుచోట్ల అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. కార్యాలయాలు తెరుచుకునే వీలు లేకపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.