ఎలుక‌ల‌పై ప‌రీక్ష స‌క్సెస్‌.. ముక్కు ద్వారా క‌రోనా టీకా!

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నియంత్రించడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్ర‌వేత్త‌లు ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు. సార్స్‌-సీవోవీ-2 వైర‌స్‌ను టార్గెట్ చేసి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. Also Read : సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం అవుతుందో తెలుసా? ఈ వ్యాక్సిన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 9:04 pm
Follow us on

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నియంత్రించడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్ర‌వేత్త‌లు ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు. సార్స్‌-సీవోవీ-2 వైర‌స్‌ను టార్గెట్ చేసి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Also Read : సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం అవుతుందో తెలుసా?

ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. వ్యాక్సిన్ తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రొఫెస‌ర్ మైఖేల్ డైమండ్ ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ద్వారా ఎలుకలు రక్షణ పొందాయని… ఎలుకల్లో ఇమ్యూనిటీ పొందినట్లు తాము గుర్తించామని తెలిపారు. అడినోవైర‌స్‌కు స్పైక్ ప్రోటీన్ల‌ను ఎక్కించి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

సాధారణంగా అడినో వైరస్ తో తయారు చేసిన వ్యాక్సిన్లను చెయ్యి లేదా తొడ కండరాలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్ట‌ర్ డేవిడ్ క్రూయిల్ ముక్కు ద్వార ఇమ్యునిటీని పెంచే వ్యాక్సిన్ ను తయారు చేయడం గొప్ప విషయం అని చెప్పారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తోనే వైరస్ ను నియంత్రించడంలో సక్సెస్ అయ్యామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల్లో వైరస్ ను సైతం సమర్థవంతంగా నియంత్రిస్తోందని అస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో అతి త్వరలో వైరస్ ను జయించడం సాధ్యమే.

Also Read : నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘కరోనా థీమ్’తో గణేష్.. ఫోటోలు వైరల్!