నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘కరోనా థీమ్’తో గణేష్.. ఫోటోలు వైరల్!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. కరోనా, ప్రభుత్వ నిబంధనల వల్ల గత సంవత్సరం స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలోనే వినాయ‌కుడి వేడుకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుండే గణనాథునికి పూజలు చేస్తున్నారు. విఘ్నేషుడికి సంబంధించిన విగ్రహాల పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో నందిని విఘ్నేష్ అనే మ‌హిళ కరోనా థీమ్ తో గణపతిని తయారు చేసింది. Also Read : ఎలుక‌ల‌పై […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 9:07 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. కరోనా, ప్రభుత్వ నిబంధనల వల్ల గత సంవత్సరం స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలోనే వినాయ‌కుడి వేడుకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుండే గణనాథునికి పూజలు చేస్తున్నారు. విఘ్నేషుడికి సంబంధించిన విగ్రహాల పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో నందిని విఘ్నేష్ అనే మ‌హిళ కరోనా థీమ్ తో గణపతిని తయారు చేసింది.

Also Read : ఎలుక‌ల‌పై ప‌రీక్ష స‌క్సెస్‌.. ముక్కు ద్వారా క‌రోనా టీకా!

కరోనా వైరస్ నేపథ్యంలో గణేషున్ని అలంకరించింది. వేల సంఖ్యలో గణేష్ విగ్రహాలను పండుగ జరుపుకోవడం కోసం ఆమె సేకరించింది. నందిని విఘ్నేష్ మాట్లాడుతూ చాలా రోజుల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు గణేష్ విగ్రహాలను సేకరించడం ప్రారంభించామని… ఆ విధంగా ఇప్పటివరకు 3,500 విగ్రహాలను సేకరించామని చెబుతోంది. విగ్రహాల సేకరణ కోసం చాలా ప్రాంతాలకు వెళ్లినట్లు నందిని విఘ్నేష్ చెప్పుకొచ్చింది.

ఫేస్‌మాస్క్, శానిటైజర్ ఉన్న గణేష్ విగ్రహం వ్యక్తిగత పరిశుభ్రత గురించి సందేశాన్ని ఇస్తుందని ఆమె చెప్పింది. వినాయకుడి వాహనమైన ఎలుకకు సైతం ఫేస్ మాస్క్ పెట్టామని పేర్కొంది. ఏ వేదికపై విగ్రహాన్ని ఉంచామో దానిపై కరోనాకు సంబంధించిన వాటిని చూడగలుగుతామని ఆమె పేర్కొంది. పోలీస్ అధికారులు, వైద్యులు, ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కృషికి విగ్రహం తెలియజేస్తుందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా నందిని విఘ్నేష్ కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read : గుడ్ న్యూస్.. ‘కరోనా వైరస్’ను తగ్గిస్తున్న ఆయింటిమెంట్!