
ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు కిడ్నాప్, గ్యాంగ్ రేప్ జరిగినట్లు కేసు నమోదు చేశారు. ఆటోడ్రైవర్ గ్యాంగుపై పలు కేసులు నమోదు చేశారు. ఇన్చార్జి సీపీ సజ్జనార్ నేతృత్వంలో కేసులు పర్యవేక్షిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన ఆటోడ్రైవర్లు ఈగ రాజు, భాస్కర్, నందన్, శివను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి… పరీక్షల అనంతరం విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారు.
Also Read: కేసీఆర్-ఓవైసీ దోస్తీ ‘గ్రేటర్’లో బయటపడింది
ఫార్మసీ స్టూడెంట్ బుధవారం సాయంత్రం ఆర్ఎల్ నగర్ లోని ఆమె ఇంటికి వెళ్లేందుకు రాంపల్లి చౌరస్తాలో సాయంత్రం 6గంటల సమయంలో ఆటో ఎక్కింది. ఆర్ఎల్ నగర్లో ఆపకుండా డ్రైవర్ యమ్నంపేట్ లో మరో ముగ్గురిని ఎక్కించుకున్నారు. ఆటో ఆపకుండా స్పీడ్ గా తీసుకు వెళ్లాడని.. అప్పటికే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. భయంతో స్టూడెంట్ కేకలు వేయడంతో నిందితులు ఆమెను రాడ్డుతో కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. యమ్నాంపేట్ శివారులోని రైల్వే ట్రాకు వద్దకు తీసుకెళ్లి… రేప్ చేసి అన్నోజీగూడు వద్ద వరంగల్ హైవేకు దగ్గర్లో వదలిపెట్టి వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.
Also Read: రాజకీయాల్లోకి అనసూయ.. ఏ పార్టీలో చేరబోతోంది?
బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం 100కు కాల్ చేయడంతో సాయంత్రం ఆరున్నర గంటల నుంచే పోలీసులు వెతకడం ప్రారంభించారు. బాధితురాలి సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గాలించారు. ఫార్మసీ స్టూడెంట్ బస్ దిగిన రాంపల్లి చౌరస్తా నుంచి ఆర్ఎల్ నగర్, యమ్నాంపేట, అన్నోజీగూడ, వరకు పరిశీలించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అన్నోజీగూడ వద్ద పడిఉన్న బాధితురాలిని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు ఈగ రాజు, భాస్కర్, నందర్, శివను అరెస్టు చేశారు. ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగు రేపు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
జరిగిన దారుణంపై ఆర్ఎల్ నగర్ వాసులు గురువారం ఆందోళనకు దిగారు. కాలనీ రోడ్డుపై బైటాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మహిళలకు మరింత భద్రత కల్పించాలని అన్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మహిళా సంఘం నాయకులు అంటున్నారు. అయితే బాధితురాలు బాగానే ఉందని.. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.