Upasana: మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే న్యూస్ ఇటీవల చిరంజీవి షేర్ చేశారు. చరణ్-ఉపాసన తమ ఫస్ట్ చైల్డ్ ని ఆహ్వానిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. పదేళ్ల నిరీక్షణ కావడంతో మెగా ఫ్యాన్స్ లో థ్రిల్ ఫీల్ అయ్యారు. సోషల్ మీడియాలో మెగా వారసుడు వస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. 2012లో ఉపాసన-రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా రామ్ చరణ్-ఉపాసన పిల్లలు కనడంపై చర్చ నడుస్తుంది. ఒకటి రెండు సందర్భాల్లో మీడియా నుండి ఉపాసన ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

ఒక ఇంటర్వ్యూలో ఉపాసన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. పిల్లల్ని కనడం 20 ఏళ్ల సుదీర్ఘ ప్రాజెక్ట్ అన్నారు. పిల్లలను కనడానికి మనం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాయి. ఒక బిడ్డను ఈ ప్రపంచంలోకి తేవడం చిన్న విషయం కాదు. పిల్లలకు ఏం కావాలి? ఎలా పెంచాలి? ఎలాంటి పరిస్థితులు కల్పించాలి? అనే విషయాలపై అవగాహన ఉండాలి. స్పష్టమైన ప్రణాళిక లేకుండా బిడ్డలను కనడం సరైన నిర్ణయం కాదన్నారు.
ఏది ఏమైనా ఉపాసన తల్లి అయ్యారు. చిరంజీవి, చరణ్ ల నటవారసత్వాని ముందుకు నడిపించే వారసుడు పుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా తల్లైన ఉపాసన పుట్టింటికి వెళ్లారు. ఈ క్రమంలో అత్తమ్మ(సురేఖ)ను బాగా మిస్ అవుతున్నట్లు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ఉపాసన-రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో పాటు టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కపుల్ థాయిలాండ్ లో ఉన్నారట. అక్కడ అందమైన సాగర తీరంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదరు ఫొటోల్లో ఉపాసన బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఉపాసన బేబీ బంప్ బయటపెట్టారు. ఈ థాయిలాండ్ టూరు రెండు మూడు వారాలు ఉంటుందని సమాచారం. అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారట. ఇదిలా ఉంటే చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తున్నారు. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రెండు భిన్నమైన రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు.