Vishal- Pawan Kalyan: తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..హిట్టు /ఫ్లాపు తో సంబంధమే లేకుండా ఏ స్టార్ హీరోకి అందనంత స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఆయన..ఇప్పటికీ టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్ సూపర్ స్టార్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఓపెనింగ్స్ లో సగం కూడా వాళ్లకి రావు అని చెప్పొచ్చు.

ఒకవేళ అలాంటి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ కూడా తదుపరి చిత్రం డిజాస్టర్ అయితే కనీసం మార్నింగ్ షోస్ కూడా హౌస్ ఫుల్స్ కావు..అందుకే క్రేజ్ కి స్టార్ స్టేటస్ కి కొలమానం గా అందరూ పవర్ స్టార్ ని ఉదాహరణగా తీసుకుంటారు..ఇక సెలబ్రిటీస్ లో కూడా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే..స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారే.
ముఖ్యంగా తమిళ హీరోలు అయితే పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ఇష్టపడతారు..అక్కడి అగ్రహీరోలైనా విజయ్ , అజిత్ మరియు విక్రమ్ వంటి స్టార్ హీరోల దగ్గర నుండి,కుర్ర హీరోలైన ధనుష్, శింబు మరియు శివ కార్తికేయన్ వరకు పవన్ కళ్యాణ్ ని ఎంతగానో అభిమానిస్తారు..పబ్లిక్ వేదికలపై తమ ఫేవరెట్ హీరో అని కూడా చాలా సందర్భాలలో చెప్పారు కూడా..ఇప్పుడు లేటెస్ట్ గా మరో తమిళ హీరో విశాల్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు..ఆయన హీరోగా నటించిన ‘లాఠీ’ అనే చిత్రం ఈ నెల 22 వ తారీఖున జరగబోతుంది..ఈ సందర్భంగా ఆయన తిరుపతి లోని SV ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ ‘ఇది చెప్పడానికి నాకు ఎంతో సంతోషం గా ఉంది..థియేటర్ నా గుడి..ఆ థియేటర్ లో నాకు ఎంతో ఇష్టమైన హీరో..మీ అందరికి ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ సినిమా కి టికెట్ కొని , సినిమా చూసి నేను ఎంతగానో ఆనందిస్తాను..మీరు ఇచ్చిన ప్రేమ మరియు అభిమానం ద్వారా నేను కూడా అదే ఇండస్ట్రీ లో పని చేస్తూ మీకు అలాంటి అనుభూతిని ఇస్తున్నందుకు నాకు గర్వం గా ఉంది’ అంటూ విశాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
. @VishalKOfficial about @PawanKalyan garu at #Laatti Prerelease Event @ SV Eng College, Tirupathi #LaattiOnDec22 pic.twitter.com/yyBNfpke69
— #𝗦𝗿𝗶𝗻𝗶𝘃𝗮𝘀 (@srinureddypalli) December 19, 2022