Bigg Boss winner Revanth : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి చివరి వరకు టాస్కుల పరంగా , ఎంటర్టైన్మెంట్ పరంగా తిరుగులేని వినోదాన్ని పంచిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ అనే చెప్పాలి..తనకి కోపం ముక్కు మీదనే ఉంటుంది అని అంటుంటారు తోటి కంటెస్టెంట్స్..అంతే కాదు అందరితో బాగా కలిసిపోయిన కంటెస్టెంట్ కూడా తానే అని కూడా అంటుంటారు.

ఇలా తోటి కంటెస్టెంట్స్ దృష్టిలో పాజిటివ్ మరియు నెగెటివ్ ఫీలింగ్స్ సరిసమానంగా ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లో బహుశా రేవంత్ ఒక్కడే అని చెప్పొచ్చు.. ఓటింగ్ లో కూడా ఆయన మొదటి రోజు అందరిని డామినేట్ చేస్తూ అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉండేవాడు..చివరి నిమిషం వరుకు అదే విధమైన జోరు కనిపించింది..కానీ నాగార్జున రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనడం మాత్రం చూసే ప్రతీ ప్రేక్షకుడికి అన్యాయం అనిపించింది.
కానీ ట్రోఫీ మాత్రం రేవంత్ కే దక్కింది..అయితే విన్నర్ గా నిలిచిన శ్రీహాన్ కంటే రేవంత్ కి ఎక్కువ డబ్బులు వచ్చాయి అని చెప్పొచ్చు.. బిగ్ బాస్ ఇచ్చిన పది లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటుగా.. 25 లక్షలు విలువ చేసే ఫ్లాట్.. అది ఇప్పుడు 30 లక్షల రూపాయలకు చేరిందట.. వీటితో పాటు పది లక్షల రూపాయలు విలువ చేసే బ్రీజా కార్..అలా మొత్తం 50 లక్షలు ఈ షో ద్వారా ఆయన గెలుచుకున్నాడు.
అలాగే 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను ఆయనకి 7 లక్షల రూపాయిల వరకు పారితోషికం వచ్చింది..అలా మొత్తం మీద ఆయనకి ఈ షో ద్వారా 57 లక్షల రూపాయిలు దక్కింది..ప్రేక్షకుల నిర్ణయం తో రెండవ స్థానంలోకి వచ్చి బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీ మరియు 57 లక్షలు గెలుచుకున్న ఏకైక కంటెస్టెంట్ గా రేవంత్ బిగ్ బాస్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.