
Adipurush Lyrical Video: ఆదిపురుష్ నుండి వస్తున్న ప్రతి అప్డేట్ నిరాశపరిచాయి. ఈసారి మాత్రం దర్శకుడు ఓం రౌత్ మెప్పించారు. వన్ మినిట్ లిరికల్ వీడియో అద్భుతంగా ఉంది. రాముని ఉద్దేశిస్తూ ఆయన సైన్యం పాడిన ‘జై శ్రీరామ్’ పాట ఆకట్టుకుంది. విల్లు ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్న రామునిగా ప్రభాస్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ పోస్టర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఆదిపురుష్ లిరికల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ అప్డేట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ రామాయణ గాథగా తెరకెక్కుతుంది. ప్రభాస్ మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు. అందులోనూ రాముని పాత్ర చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఇక సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చేస్తున్నారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. టీజర్ పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆరు నెలలు వాయిదా వేశారు.

రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ లుక్స్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు ఓం రౌత్ కి రామాయణం తెలుసా? రావణాసురుడు శివ భక్తుడు, ఆయన్ని ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ వర్గాలు, హిందూవాదులు ఆదిపురుష్ చిత్రాన్ని ఆడనీయం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. టీజర్ చూశాక ప్రభాస్ సైతం నిరాశపడ్డాడని ఓం రౌత్ కి క్లాస్ పీకాడంటూ కథనాలు వెలువడ్డాయి.
ఓం రౌత్ ని సీరియస్ గా తన రూమ్ కి పిలుస్తున్న ఓ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఆదిపురుష్ అవుట్ ఫుట్ మీద అసహనం వ్యక్తం చేశారు. అయితే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని 3డీ ఫార్మాట్ లో తీసిన చిత్రం ఇది. కాబట్టి థియేటర్స్ లో చూస్తే మీ అభిప్రాయం మారిపోతుందని ఓం రౌత్ వివరణ ఇచ్చారు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయన్న వాదన వినిపించింది. ఇక ఆదిపురుష్ ప్రభాస్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
జై శ్రీరామ్ 🏹
If you can't visit the Char Dhaam,
Just chant the name of Prabhu Shri Ram.
Jai Shri Ram 🙏🏻#JaiShriRam lyrical motion poster out now!Telugu: https://t.co/NRBMx9OZKK
Hindi: https://t.co/RB0fiFcNyG#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon pic.twitter.com/p2fHjum7AZ— UV Creations (@UV_Creations) April 22, 2023