
Renu Desai- Upasana: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తర్వాత తన పిల్లలతో కలిసి పూణే లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.పవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేసిన రేణు దేశాయ్ ఇప్పుడు మళ్ళీ సినీ రంగం లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో రేణు దేశాయ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
వీటితో పాటుగా పలు సినిమాల్లో కూడా నటించడానికి ఆమె సైన్ చేసింది.అలా సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసిన రేణు దేశాయ్ సోషల్ మీడియా లో మొదటి నుండి యాక్టీవ్ గా ఉంటూ తన వ్యక్తిగత జీవితం గురించి పోస్టులు మరియు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండే సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది.
తనకి చాలా కాలం నుండి గుండెకి సంబంధించి సమస్య ఉందని, ఇన్ని రోజులు దానితో ఎంతో సమర్థవతంగా పోరాడుతున్నాని చెప్పుకొచ్చింది.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు, కారణం అకిరా నందన్ మరియు ఆద్య పవన్ కళ్యాణ్ కి పిల్లలు అవ్వడం వల్లే.మెగా ఫ్యామిలీ లో కూడా రేణు దేశాయ్ ని ఇప్పటికీ ఎంతో గౌరవంగా చూస్తుంటారు.ఆ క్రమం లోనే రేణు దేశాయ్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలుసుకున్న ఉపాసన వెంటనే రేణు దేశాయ్ కి కాల్ చేసి అసలు సమస్య ఏంటో తెలుసుకుందట.

అతి త్వరలోనే దీని కోసం ప్రత్యేకమైన వైద్య బృందం ని రేణు దేశాయ్ కోసం విదేశాల నుండి రప్పిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .ఉపాసన కి ఇలాంటి పనులు చెయ్యడం అంటే చాలా ఇష్టం, గతం లో కూడా ఆమె ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయించి ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉన్నాయ్,రేణు దేశాయ్ కి ఉన్న గుండె సమస్య కూడా అదే విధంగా పరిష్కరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.