
Upasana Delivery Date: పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. 2012లో రామ్ చరణ్-ఉపాసన వివాహం చేసుకున్నారు. అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చాలా లేటుగా చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఉపాసన గర్భం దాల్చారన్న శుభవార్త కోసం ఆతృతగా ఎదురుచూశారు. 2022 డిసెంబర్ నెలలో చిరంజీవి ఈ శుభవార్త అభిమానులతో పంచుకున్నారు. ఆ హనుమాన్ అశీసులతో రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిరంజీవి ప్రకటన మెగా అభిమానుల్లో సంతోషం నింపింది. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
ఉపాసన సీమంత వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు అమ్మింటివారు ఇటు అత్తింటివారు ఉపాసన ఉపాసన సీమంత వేడుకలు నిర్వహించారు. దుబాయ్ లో ఉపాసన కుటుంబ సభ్యులు సీమంతం జరపడం విశేషం. సీమంతంతో పాటు వరల్డ్ ట్రిప్ కూడా ఉపాసన పూర్తి చేసుకొని వచ్చారు. ఈ బుధవారం హైదరాబాద్ లో కొణిదెల ఫ్యామిలీ ఉపాసన సీమంతం నిర్వహించారు. ఈ ఫోటోలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా ఉపాసన డెలివరీ డేట్ వైద్యులు ఇచ్చేశారట. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. జులై నెలలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనున్నారట. ఇప్పటి నుండి తనకు డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ సతీమణి పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నారట. దీంతో షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చుకున్నారట. రానున్న నాలుగైదు నెలలు రామ్ చరణ్ ఎలాంటి షూటింగ్స్, మీటింగ్స్ లో పాల్గొనడని ఉపాసన వెల్లడించారట. మొన్నటి వరకూ బిజీగా గడిపిన రామ్ చరణ్ కొన్ని నెలల పాటు తనతోనే ఉంటాను అన్నాడట.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. యాభై శాతానికి పైగా గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుపుకుంది. సోషల్ మెసేజ్ తో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు తన బ్యానర్ లో 50వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు.గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.