https://oktelugu.com/

Train: ఆయన ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది.. ఇల్లు చేరడానికి 22 ఏళ్ల పట్టింది!

Train: రైలు ప్రయాణం ఎంత సుఖమో.. కొన్నిసార్లు అంతే ప్రమాదకరం. సాధారణంగా మన రైళ్లు సమయానికి రావు. ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం మనం ఇంకాస్త లేట్ గా వెళ్తాం. రైలు ఆలస్యం అయితే వెయిట్ చేయొచ్చు.. కానీ ముందే వెళ్లిపోతే దాని ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఆయన ఇల్లు చేరడానికి 22 ఏళ్లు పట్టింది. ఉపాధి కోసమని.. ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ […]

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 22, 2023 10:29 am
    Follow us on

    Train

    Train

    Train: రైలు ప్రయాణం ఎంత సుఖమో.. కొన్నిసార్లు అంతే ప్రమాదకరం. సాధారణంగా మన రైళ్లు సమయానికి రావు. ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం మనం ఇంకాస్త లేట్ గా వెళ్తాం. రైలు ఆలస్యం అయితే వెయిట్ చేయొచ్చు.. కానీ ముందే వెళ్లిపోతే దాని ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఆయన ఇల్లు చేరడానికి 22 ఏళ్లు పట్టింది.

    ఉపాధి కోసమని..
    ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఏళ్లతరబడి కుటుంబానికి దూరమయ్యాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత విధి అతడిని తన కుటుంబం వద్దకు చేర్చింది. బిహార్‌ రాష్ట్రంలోని దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్‌ ఝా ఉన్నచోట పని దొరక్క.. భార్య, మూడేళ్ల కుమారుడిని ఇంట్లో వదిలేసి రైల్లో హరియాణాకు పయనమయ్యాడు. అంబాలా స్టేషనులో రైలు ఆగింది.

    నీళ్ల కోసం దిగి..
    దాహం వేయడంతో నీళ్లబాటిల్ కొనడానికి రమాకాంత్‌ రైలు దిగాడు. నీళ్లు కొనుక్కొని మళ్లీ రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో రమాకాంత్‌కు తోచలేదు. అలా తిరుగాడుతూ ఆకలిదప్పులతో క్రమంగా అతడి మానసిక పరిస్థితి మరింత దిగజారింది. రోడ్డు పక్కన దొరికింది తింటూ కాలం గడిపాడు.

    స్వచ్ఛంద సంస్థ సహకారంతో..
    రమాకాంత్‌ ఏమయ్యాడో తెలియని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, పలుచోట్ల వెదికారు. వీధుల్లో తిరుగుతున్న రమాకాంత్‌ కర్నాల్‌లో ఉండే ‘ఆషియానా’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టరు రాజ్‌కుమార్‌ అరోరా కంటపడ్డాడు. ఆయన తన ఇంటికి తీసుకెళ్లి.. మంచి ఆహారం, వైద్యం అందించారు. రెండు నెలల తర్వాత రమాకాంత్‌కు గతం గుర్తొచ్చింది. దర్భంగా జిల్లా ఎస్పీకి రాజ్‌కుమార్‌ ఫోన్ చేసి విషయం చేరవేశారు.

    Train

    Train

    సుదీర్ఘ కాలం తర్వాత..
    22 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత బుధవారం తన కుటుంబాన్ని రమాకాంత్‌ కలుసుకొన్నాడు. మూడేళ్ల బాలుడిగా తాను చూసిన కుమారుడిని ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడిగా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

    ఇలా రమాకాంత్ ఎక్కాల్సిన రైలు మిస్ కావడంతో.. తిరిగి ఆయన ఇల్లు చేరడానికి 22 ఏళ్లు పట్టింది. అందుకే చాలా మంది మధ్యలో రైలు దిగడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

    Tags