Rahul Gandhi- Priyanka Gandhi: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అనుబంధం సోదరి, సోదరుల మధ్య ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలను కూడా సోదరికి లేదా సోదరుడికి చెప్పుకుంటాం. సోదరికి ఏమైనా.. సోదరుడికి ఏమైనా తల్లడిల్లిపోతాం. కానీ, రాజకీయాల కోసం ఈ బంధాన్ని కూడా భ్రష్టుపట్టిస్తున్నారు. తాజాగా సోదరి ప్రియాంకకు రాహుల్ ముద్దుపైనా బీజేపీ అభ్యంతరం చెబుతోంది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

తోబుట్టువుకు ముద్దుపై అభ్యంతరం ఏంటి?
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడాన్ని ప్రశ్నించడాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ తప్పు పట్టారు. 50 ఏళ్ల వయస్సులో తన సోదరిని బహిరంగ సభలో ముద్దు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను కౌరవులతో రాహుల్ పోల్చిన నేపథ్యంలో యూపీ మంత్రి రాహుల్ సోదరికి పెట్టిన ముద్దుపై ఇలా స్పందించారు.
పాడవులు ఇలాంటి పని చేయలేదు..
రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ని ‘21వ శతాబ్దపు కౌరవులతో‘ సమానం అని భారత్ జోడో యాత్రలో ఆరోపించారు. దీనికి యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ‘సంఘ్ ప్రచారక్‘ అవివాహితులు గా ఉంటారు, ఎటువంటి దురాశ లేకుండా దేశ నిర్మాణానికి అంకితమవుతారు’ అని తెలిపారు. రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ని ‘కౌరవులు’ అని పిలుస్తున్నారంటే.. ఆయన పాండవులా? అని ప్రశ్నించారు. ‘తనను తాను పాండవుడిగా చూస్తుంటే 50 ఏళ్ల వయసులో రాహుల్ గాంధీ చేసినట్టుగా బహిరంగ సభలో పాండవులు తమ సోదరిని ముద్దుపెట్టుకున్నారా?’ అని ప్రశ్నించారు. ‘ఇది మన సంస్కృతి కాదు.. ఎందుకంటే భారతీయ సంస్కృతి అలాంటి వాటికి అనుమతి ఇవ్వదు’ అని పేర్కొన్నారు.

2019లో సోనియాపై పోటీ..
దినేష్ ప్రతాప్ సింగ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో సోనియాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓడిపోతారని, ‘రాయ్‌బరేలీ నుంచి నిష్క్రమించే చివరి విదేశీయుడు అవుతారని‘ జోస్యం చెప్పారు. ‘రాయ్‌బరేలీని సందర్శించే విషయానికి వస్తే, ఆమె (సోనియా గాంధీ) తనకు బాగా లేదని ఎప్పుడూ చెబుతుంది, కానీ ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రమోట్ చేయడానికి ‘భారత్ జోడో యాత్ర’లో అతనితో కలిసి నడుస్తూ కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. 2024 లో, ఆమె ఎంపీ కాదు. మరియు రాయ్‌బరేలీ నుంచి∙నిష్క్రమించిన చివరి విదేశీయురాలు అవుతారు’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘సోనియా గాంధీ విదేశీయురాలిని కాదని కాంగ్రెస్ నుంచి ఎవరైనా చెప్పగలరా’ అని ప్రశ్నించారు. ఆమె విదేశీయురాలు కాబట్టి ఆమెకు ప్రధాని పదవిని నిరాకరించారు. బ్రిటీష్‌ల నుంచి స్వాతంత్రం పొందిన భారతీయులు ఇక ఏ విదేశీయుని పాలనను అంగీకరించరని పేర్కొనడం ద్వారా సోనియా విదేశీయతను మరోమారు సింగ్ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఈఅంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.