Unstoppable With NBK Season 2 Episode 3: ప్రముఖ కథానాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అదరగొడుతున్నారు. తనదైన పంచ్ డైలాగులతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమాలోలాగా తనదైన సంభాషణలతో గెస్టులను సైతం ఉత్సాహానికి గురి చేస్తున్నారు. అన్ని తానై నడిపిస్తూ అందరిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఆద్యంతం షోను రక్తికట్టిస్తున్నారు. ప్రముఖులను గెస్టులుగా ఆహ్వానిస్తూ వారిని పలు ప్రశ్నలతో బెదరగొడుతున్నారు.

మొదటి, రెండో ఎపిసోడ్లకు తన బావ నారా చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లను ఆహ్వానించి వారిని అనేక రకాలుగా ప్రశ్నించి తనదైన శైలిలో సమాధానాలు రాబట్టారు. ఇక మూడో ఎపిసోడ్ కు ప్రముఖ కథానాయకులు శర్వానంద్, అడివి శేషులను ఆహ్వానించారు. వీరి మధ్య కూడా ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా శర్వానంద్.. బాలయ్యను ఓ ప్రశ్న అడిగారు. ‘మీరు ఎంతో మంది హీరోయిన్లతో తీశారు కదా. మీపై ఎఫైర్ రూమర్స్ రాలేదా?’ అని అడిగారు.
దీనికి బాలయ్య కొంటె సమాధానమే చెప్పారు. నాపై వార్తలు రాసే దమ్ము ఎవరికి ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో సామాజిక మాధ్యమాల ప్రభావం లేకపోవడంతో ఇవేవీ పత్రికల్లో వచ్చేవి కావన్నారు. హీరోయిన్లపై ఏ రకమైన వార్త కూడా ఉండేది కాదు. బాలయ్యకు ఎంత మందితో సంబంధం ఉందనే విషయం రాసే ధైర్యం కూడా చేసేవారు కాదు.. కాకపోతే ఆయన అలాంటి వాటిని ప్రచారంలోకి రాకుండా చూసుకునేవారు. దీంతో వారి మనుగడకు ఎలాంటి ముప్పు రాలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో ఎన్నో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అందుకే శర్వానంద్ ప్రశ్నకు ఆయన అలా సమాధానం ఇచ్చారు.

అప్పటి రోజుల్లో ఇంత బహిరంగంగా మాట్లాడేవారు కాదు. సినిమా అంటే అదో రంగుల ప్రపంచం అంతే. కానీ అందులో చీకటి విషయాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. దీంతో హీరోల ఆటలు సాగేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. చీటికి మాటికి ఏదో ప్రచారం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ప్రతి విషయాన్ని ప్రచారం చేస్తూ విస్తృతంగా సాగదీస్తున్నారు. మొత్తానికి అన్ స్టాపబుల్ షో బాలయ్య బాబుతోనే ఎంతో హుషారుగా సాగుతోంది. ఆయన పంచులతోనే ప్రేక్షకులకు పండుగ అవుతోంది. బాలయ్య హోస్ట్ గా నడుస్తున్న మొదటి షో కావడంతో అందరి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
https://www.youtube.com/watch?v=z5z6DNlXOzo