Siddipet: అమ్మాయిలే టార్గెట్.. రెచ్చిపోతున్న ‘కామ’ సైకో

సిద్దిపేట జిల్లా నవాబ్ పేటకు చెందిన అమ్మాయిలకే ఈ నంబర్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయి. వారం రోజులుగా ఈ నంబర్‌ బాధితులు ఒకే గ్రామానికి చెందినవారు ఉండడం ఆశ్చర్య పరుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : February 27, 2024 6:35 pm
Follow us on

Siddipet: ‘8977138083’ .. ఈ నంబర్‌ చూడగానే ఇందులో ఏముంది అని ఆలోచిస్తున్నారా.. వింత ఏమీలేదు.. ఫ్యాన్సీ నంబర్‌ కూడా కాదని అనుకుంటున్నారా.. మీరు అనుకుంటున్నది నిజమే.. కానీ ఈ నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తే అమ్మాయిలు హడలి పోతున్నారు. అమ్మాయిలే టార్గెట్‌గా ఓ సైకో ఈ నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నాడు. సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ చేస్తున్నారు. రోజు రోజుకూ ఈ నంబర్‌ బాధితులు పెరుగుతున్నారు. పోలీసులకు ఫిర్యాదుల పెరుగుతున్నాయి.

ఎక్కడ అంటే..
సిద్దిపేట జిల్లా నవాబ్ పేటకు చెందిన అమ్మాయిలకే ఈ నంబర్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయి. వారం రోజులుగా ఈ నంబర్‌ బాధితులు ఒకే గ్రామానికి చెందినవారు ఉండడం ఆశ్చర్య పరుస్తోంది. కేవలం అమ్మాయిలకే ఫోన్‌ చేయడం.. పిచ్చిపిచ్చిగా మాట్లాడడం చూసి యువతులు ఆ నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తే లిఫ్ట్‌ చేయడానికి భయపడుతున్నారు.

ఫోన్‌ నంబర్లు ఎలా వెళ్తున్నాయి..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత సమాచారం లీక్‌ అవుతోంది. మనకు తెలియకుండానే మన ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు సైబర్‌ నేరగాళ్ల చేతులకు వెళ్తున్నాయి. కొన్ని మన నిర్లక్ష్యంగా సమాచారం లీక్‌ అవుతోంది. ఇదే అదనుగా సైకో అమ్మాయిల నంబర్లు సేకరించి ఉంటాడని తెలుస్తోంది. తెలిసిన వ్యకే అయి ఉంటాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. లేదంటే మన నంబర్లు ఎలా వెళ్తాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీసేవ కేంద్రాల నిర్వాహకులు, లేదా వారితో సంబంధాలు ఉన్నవారు ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఫిర్యాదుకు వెనకడుగు..
అమ్మాయిలకు రోజు రోజుకూ వేధింపులు పెరుగుతున్నా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. నలుగురు ఐదుగురు ఫిర్యాదు చేసినా పోలీసులు లైట్‌ తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని, పరువు పోతుందని, పోలీసులు తరచూ స్టేషన్‌కు పిలిపిస్తారని ఫిర్యాదుకు చాలా మంది దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఫిర్యాదు చేసిన వాళ్లు గ్రామంలో ‘8977138083’ నంబర్‌ బాధితులు చాలా మంది ఉన్నారని చెప్పినా విచారణ జరుపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరేమో గ్రామంలోని యువకులు, ప్రజాప్రతినిధుల సాయం కోరుతున్నారు.