Unique Places India : భారత్ లో తప్పకుండా చూడాల్సిన 15 ప్రదేశాలు ఇవీ

పశ్చిమాన రాజస్థాన్ ఎడారులు.. దక్షిణాదిన రుతుపవనాల సమశీతోష్ణ స్థితి.. కొండలు పర్వాతాలు.. నదులు అందుకే భారత్ లో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో.. ఇండియాలోని టాప్ 15 యూనిక్యూ ప్లేసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: NARESH, Updated On : June 30, 2023 5:09 pm
Follow us on

Unique Places India : ప్రపంచంలోని అన్ని ఉష్ణోగ్రతలు.. అన్ని రకాల వైవిధ్య ప్రాంతాలు భారత్ లో ఉంటాయి.. 24 గంటలూ వర్షం పడే మేఘాలయ రాష్ట్రం ఈశాన్యంలో.. మంచు కురిసే కశ్మీర్, హిమాచల్ ఉత్తరాన.. పశ్చిమాన రాజస్థాన్ ఎడారులు.. దక్షిణాదిన రుతుపవనాల సమశీతోష్ణ స్థితి.. కొండలు పర్వాతాలు.. నదులు అందుకే భారత్ లో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో.. ఇండియాలోని టాప్ 15 యూనిక్యూ ప్లేసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1.చాండీపూర్ బీచ్, ఒడిషా

బాలోసోర్ 16 కి.మీలు ఉండే ఈ చాండీపూర్ బీచ్ ప్రపంచంలోనే ఎవరూ ఉపయోగించని బీచ్ గా గుర్తింపు పొందింది..

2.చీరపుంజిలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్

దేశంలోనే అత్యధిక వర్షపాతం పడే మేఘాలయలోని చీరపుంజిలో చెట్లతో అల్లుకొని కాలువలపై అల్లుకున్న బ్రిడ్జీలు చూడాల్సిందే..

3. లోక్ తక్ సరస్సు, మణిపూర్

సరస్సు.. మధ్యలో భూమి, పచ్చటి మైదానాలు వాటిలో రిసార్ట్ ఇల్లులు.. చూడడానికి మణిపూర్ లోని లోక్ తక్ సరస్సు అందాలతో పచిచినట్టు ఉంటుంది.

4, లోనార్ క్రాటర్, ఔరంగాబాద్

చుట్టూ కొండలు దట్టమైన అడవి మధ్యలో లోనార్ క్రాటర్ సరస్సు చూడడానికి రెండు కళ్లు చాలవు

5. బరా ఇమామ్ బర, లక్నో

లక్నోలోని బరా ఇమామ్ బర ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతమని చెప్పొచ్చు. దీన్ని చూస్తే ఎంత అద్భుతంగా కట్టారో అని అందరూ ఆశ్చర్యపోతారు

6.రూప్ కుండ్ లేక్, ఉత్తరాఖండ్

మంచు కురిసే హిమాలయాల్లోని రూప్ ఖుండ్ లే చూస్తే ఏదో హాలీవుడ్ సినిమాల్లోని విదేశాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది..

7. రివర్స్ వాటర్ ఫాల్.. నానేఘాట్

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ‘నానేఘాట్ రివర్స్ జలపాతం’ చూపారులను మంత్రముగ్ధులను చేస్తుంది.

8.మాగ్నెట్ హిట్, లఢక్

జమ్మూకశ్మీర్ లోని లఢక్ లో ఉన్న ‘మాగ్నెట్ హిల్’ జియోగ్రాఫికల్స్ ఒక అద్భుతమైన కొండగా పేరొందింది.

9.సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయ్ లెట్స్, ఢిల్లీ

ఢిల్లీలోని టాయ్ లెట్ మ్యూజియం ఒక యూనిక్యూ యూనివర్సల్ గా ప్రసిద్ది చెందింది.

10. ధనుష్ కోటి బీచ్, రామేశ్వరం

భారత్ దేశానికి దక్షిణాన చిట్టచివరన ఉన్న ధనుష్ కోటి బీచ్ వద్ద తక్కువ ప్రాంతంలో భూమి.. చుట్టూ బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసి ఉంటుంది.

11. శని శిగ్నాపూర్, మహారాష్ట్ర

దేశంలోనే శనిదేవుడు కొలువైన శని శిగ్నాపూర్ ఎంతో పాపులర్ దేవాలయంగా ఉంది.ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు..

12.మాసిన్ రాం, మేఘాలయ

ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ఒకటి మన మేఘాలయలోని మాసిన్ రాం.. సంవత్సరం పొడువునా వర్షం పడే ఈ ప్రాంతం పచ్చటి కోకతో ఆకట్టుకుంటుంది.

13. కుల్దారా, రాజస్థాన్

మొండి గోడల ఇళ్లు, టాప్ లేని బోసిపోయి ఉండే నిర్జీవ గ్రామం చారిత్రక నేపథ్యమున్న కుల్దారా రాజస్థాన్ లో చూడదగ్గ ప్రదేశం..

14. కొడిన్షి, కేరళ

ఫొటోగ్రఫీ, చూడముచ్చటైన ప్రకృతి రమణీయత ఉట్టి పడే ప్రాంతం కొడిన్హి. ఇది కేరళలోని అద్భుతమైన ప్రకృతిసిద్ధ ప్రాంతం.

15. జాతింగ వ్యాలీ, అస్సాం

ప్రకృతి పోతపోసినట్టుండే జాతింగ వ్యాలీ అసోంలో చూడదగ్గ ప్రదేశం.. నేచర్ ఉట్టిపడే ఈ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతారు.