
కరోనా మహమ్మారి విలయం దేశమంతటా కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. కరోనా వైరస్ వల్ల కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. కష్టపడే శక్తి ఉన్నా చాలామంది ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే టెక్నాలజీపై కొంచెం అవగాహన ఉంటే చాలా సులభంగా ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ట్రాన్స్ క్రైబింగ్, ఫ్రూఫ్ రీడింగ్, బ్లాగింగ్, గ్రాఫిక్ డిజైనర్, సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్, ఇన్స్టాగ్రామ్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవాళ్లు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా చాట్ చేస్తే చాలు వేల రూపాయలు సొంతమవుతాయి. ఈ మార్కెటింగ్ ద్వారా ఇంట్లో నుండే సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ కూడా సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
సోషల్ మీడియా ఖాతాలలో ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం చేసి డబ్బులు పొందవచ్చు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లక్షల్లో సంపాదించే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు యూట్యూబ్ నే కెరీర్ గా మలుచుకుంటే వ్యూస్, సబ్ స్క్రైబర్లు పెరిగే కొద్దీ సంపాదన పెరుగుతుంది. గ్రాఫిక్ డిజైన్ తెలిసిన వాళ్లు ఇంట్లో నుంచె బ్లూ క్యాప్ కప్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్, కంటెంట్ రైటింగ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు.