https://oktelugu.com/

మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్, వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పెట్టి.. రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని క్రిష్, ఫామ్ లో ఉన్న హీరోతో చేద్దామనుకున్నాడు. కానీ, ‘ఉప్పెన’ సినిమాని చూసిన క్రిష్ కి, వైష్ణ‌వ్‌ తేజ్ నటన బాగా నచ్చిందట. అందుకే వైష్ణ‌వ్‌ తేజ్ […]

Written By:
  • admin
  • , Updated On : August 26, 2020 / 12:01 PM IST
    Follow us on


    మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్, వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పెట్టి.. రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని క్రిష్, ఫామ్ లో ఉన్న హీరోతో చేద్దామనుకున్నాడు. కానీ, ‘ఉప్పెన’ సినిమాని చూసిన క్రిష్ కి, వైష్ణ‌వ్‌ తేజ్ నటన బాగా నచ్చిందట. అందుకే వైష్ణ‌వ్‌ తేజ్ తో ప్రస్తుతం అడవి నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. నిజానికి వైష్ణ‌వ్‌ తేజ్ ఏ యాక్షన్ కథతో లేక కామెడీ సినిమాతోనే మెగా హీరో రేంజ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నా.. వైవిధ్యమైన కథలను పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

    Also Read: ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?

    క్రిష్ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ క్యారెక్టర్ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమా ఓ విషాద వంతమైన జీవిత కథ అని, అయితే జీవితంలో విఫలమైన ఓ యువకుడు అడవిలో మేకల కాపరిగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు. తన జీవితంలో తన తండ్రి కోసం ఏం చేశాడు అనే అంశాలు సినిమాలో హైలైట్ గా ఉంటాయట. అలాగే సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా పులితో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అలాగే ఈ సినిమా పాయింట్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. అడవిలో రెండు రాత్రులు ఉండాల్సి రావడం.. ఆ క్రమంలో హీరో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు అనే కోణంలో సినిమా వెరీ ఇంట్రస్టింగ్ గా సాగుతోందట.

    Also Read: ప్రదీప్‌ సినిమా విడుదలకు మోక్షం లభించిందా?

    ఇక వైష్ణవ్ తేజ్ చేస్తున్న ‘ఉప్పెన’ సినిమా కూడా ఓ డిఫరెంట్ పాయింట్ తో చేస్తున్నారని తెలుస్తోంది. ఒక పేద ముస్లిమ్ కుర్రాడు, అప్పర్ క్యాస్ట్ లోని డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. ఏకంగా ఆ కుర్రాడి మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారని.. దాంతో అతను ప్రేమించిన అమ్మాయికి కనబడకుండా తిరుగుతూ చివరకు ఆ అమ్మాయి కోసమే చనిపోతాడని తెలుస్తోంది. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. నిజానికి మొదటి సినిమాలోనే ఇలాంటి పాత్రలో నటించాలంటే దమ్ము ఉండాలి. ఏమైనా ఇలాంటి కొత్త పాయింట్స్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్ళితే.. వైష్ణవ్ తేజ్ క్లిక్ అవ్వడం గ్యారెంటీ. ఇక కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేది. అయితే ఈ చిత్రాన్ని నవంబర్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.