https://oktelugu.com/

సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పాలన వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. రాజధాని అంశం పై హైకోర్టు విధించిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో అభ్యర్థించిన జగన్ ప్రభుత్వానికి ఏ విషయాన్ని అయినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ సాగుతోంది…. ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇకపోతే మూడు రాజధానులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2020 1:35 pm
    Follow us on

    As Expected, Supreme Court Raps Andhra Pradesh Government

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పాలన వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. రాజధాని అంశం పై హైకోర్టు విధించిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో అభ్యర్థించిన జగన్ ప్రభుత్వానికి ఏ విషయాన్ని అయినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ సాగుతోంది…. ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది.

    ఇకపోతే మూడు రాజధానులు అంశంపై హైకోర్టులో ఈ నెల 27న విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అందువల్ల హర్షించదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది సుప్రీంకోర్టు హైకోర్టు వారిని త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించడమే. ఇక ఇప్పటికే…. ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లుని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేసిన అమరావతి రైతులు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

    ఏపీ హైకోర్టు గతంలో ఇదే విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత అందరికీ హైకోర్టు విచారణ వేగవంతం చేయనుండగా… అమరావతి రైతులు తమకు న్యాయం జరిగే వరకూ విశాఖలో ఎటువంటి రాజధాని అమలుచేసేందుకు వీల్లేదని అంటున్నారు. ఇక హైకోర్టు కూడా దాదాపు రైతులకు మద్దతుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వీలైనంత త్వరగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం కష్టమే. 

    ఇలా హైకోర్టుకి…. సుప్రీంకోర్టు కి వెళ్లి ఏపీ ప్రభుత్వం భంగపాటు కి గురి కావడం చాలా రెగ్యులర్ అయినప్పటికీ చంద్రబాబుకు జగన్ దీని ద్వారా ఒక సందేశాన్ని చేసినట్లు అయింది. తన మూడు రాజధానుల కలను నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని అతను ఇన్ డైరెక్ట్ గా తెలియజేసినట్లు అయింది. మొత్తానికి హైకోర్టు మాత్రం ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా కచ్చితంగా విచారణను త్వరగా నిర్వహించి ఏదో ఒక తీర్పు వెలువరించాల్సి అవసరం ఉంది. దీనిని జగన్ తన విజయం గా పరిగణించవచ్చు.