Girls Fighting: కాలం మారిపోయింది. పరిస్థితులు కూడా వైవిధ్యంగా ఉంటున్నాయి. పాఠశాలకు వెళ్లి బుద్ధిగా చదువుకునే అమ్మాయిలు ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు. జీవితంపై ఎన్నో ఆశలతో తమ భవిష్యత్ ను మలుచుకోవాల్సిన వయసులో దారి తప్పుతున్నారు. ప్రేమలో పడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు. గతంలో అమ్మాయిలంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. కానీ కాలక్రమంలో వారిలో కూడా మార్పు వస్తోంది. కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు వెనకడాడటం లేదు. దీంతో కుటుంబ పరువు మంటగలుస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోమని పంపిస్తే లవ్ లో పడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

అది రోడ్డయినా ఫరవాలేదు. తమ పంతం నెగ్గాలని భావించి ముష్టి ఘాతుకాలకు దిగడం దేనికి నిదర్శనం. తల్లిదండ్రులు ఎంతో శ్రమించి తమ బిడ్డలు గొప్పవారు కావాలని కలలు కంటూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పని చేసుకుంటూ వారిని బడికి పంపితే వారు చేసే నిర్వాకంతో నిశ్చేష్టులవుతున్నారు. తమ కూతురు అలా చేసిందా అనే అనుమానంలోనే ఉంటున్నారు. కూతురు చేసిన పనికి ముఖం చూపించుకోలేకపోతున్నారు.
సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు కొట్టుకోవడం సహజమే. ఎందుకంటే ఆమె నాకే సొంతమని ఒకరంటే నాకు కావాలని మరొకడు అనుకుంటూ చివరకు ముష్టి యుద్ధాలకు దిగడం తెలిసిందే. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడమే వింత. ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా జరిగినా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం విశేషం. స్కూలుకు వెళ్లే అమ్మాయిలు ప్రేమించిన వాడు నాకు కావాలంటే నాకు కావాలని జట్ట్లు పట్టుకుని కొట్టుకోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇంత వైలెంట్ గా ఉంటారా అని నోరెళ్లబెట్టారు.

ఇదేదో మారుమూల గ్రామాల్లో జరగలేదు. సాక్షాత్తు చెన్నై నగరంలోనే నడిరోడ్డుపై జరగడంతో అంతా హతాశులయ్యారు. తమ కళ్లెదుట ఏం జరుగుతుందోనని కాసేపు అలాగే ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం విఠల్ మాల్యా రోడ్డు లో అమ్మాయిల గొడవ హల్ చల్ చేసింది. బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది. దీనిపై స్కూలు యాజమాన్యం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. అమ్మాయిల గొడవతో అప్రదిష్ట తప్ప ఏం ప్రయోజనం లేదని తెలిసినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు.
[…] […]