Virata Parvam: కర్నూలులో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలోడీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన విరాటపర్వం సినిమా ట్రైలర్ కార్యక్రమం రద్దయింది. గాలులకు స్ర్కీన్ వెనుకకు పడిపోయింది. దీంతో కరెంటు పోయింది. ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. అభిమానులకు ఏమైందో అర్థం కాలేదు. స్టేజి వెనక ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణనష్టం సంభవించేది. ఈ నేపథ్యంలో కార్యక్రమం అర్థంతరంగా ఆగిపోయింది. చిత్రబృందం నిరాశతో వెనుదిరిగింది.

ఒక్కసారిగా వర్షం రావడంతో జనం చెల్లాచెదురైపోయారు. విరాటపర్వం ప్రీ రిలీజ్ వేడుక కొనసాగకుండా వర్షం ఆటంకం సృష్టించింది. ప్రకృతి సైతం పగబట్టింది. దీంతో వేడుక నిర్వహణ ముందుకు సాగలేదు. ఒక్కసారిగా కరెంటు పోవడంతో ఏం జరుగుతుందోననే అందరిలో భయం నెలకొంది. చీకటి ఆవహించడంతో ప్రజలు వెనుదిరిగిపోయారు. దీంతో విరాటపర్వం కాస్త నిరాశపర్వంగా మారిపోయింది. ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న కార్యక్రమం అర్థంతరంగా ఆగిపోవడంతో చిత్ర బృందానికి తీవ్ర నష్టం జరిగింది.
వేదిక మొత్తం కరెంటు పోవడంతో అంధకారం ఏర్పడింది. కళాకారులను, గాయనీ గాయకులను స్టేజీ నుంచి కిందకు దించారు. కానీ ఎవరికి ఏ రకమైన అపాయం చోటుచేసుకోలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు విరాటపర్వం సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుందామనుకుంటే వర్షం అడ్డంకిగా మారి విలన్ గా తయారయింది. దీంతో వారి ఆశలన్ని అడియాశలే అయ్యాయి.

వర్షం రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అందాక మంచి హుషారులో ఉన్న కళాకారులు తమ ఆటపాటలతో ఉర్రూతలూగించారు. కానీ అంతలోనే విధి ఒక్కసారిగా పగబట్టింది. ప్రకృతి పడగ విప్పింది. గాలివాన బీభత్సంతో అంధకారమే అలుముకుంది. సజావుగా సాగుతుందనుకున్న కార్యక్రమం అర్థంతరంగా నిలిచిపోవడం బాధాకరమే. దీంతో చిత్ర బృందం కూడా ఎంతో ఆశతో వచ్చినా ఏమి సాగకపోవడంతో నిరుత్సాహంతోనే వెనుదిరిగారు.

[…] […]